పరకాల నేటిధాత్రి(టౌన్)
హనుమకొండ జిల్లా పరకాల గతంలో వ్యపారాలతో జనసమూహం తో కళకళ లాడేది ఆ కల ఇప్పుడు పూర్తిగా కనుమరుగైంది.పరకాల నియోజకవర్గం కింద పరకాల, రేగొండ,చిట్యాల,మొగుళ్లపల్లి, భూపాలపల్లి,మండలాల నుండి వ్యాపారం కోసం కొనుగోలు అమ్మకాల కోసం వివిధ గ్రామలనుండి పరకాల ప్రాంతానికి వచ్చి వ్యాపారాలు కొనసాగించుకునే వారు ఆదివారం అంగడి వస్తే జాతరలాగే కనిపించే వారు జనం.దాంతో పరకాల వ్యాపార కేంద్రంగా విరాజిల్లింది.ఎప్పుడైతే భూపాలపల్లి జిల్లా గా ఏర్పడిందో అప్పటినుండి పరకాల పట్టణంలో వ్యాపారాలు తగ్గుముఖం పట్టాయి చిన్న చిన్న వ్యాపారాలు సరిగా లేకపోవడంతో చిన్న వ్యాపారుల ముఖంలో చిరునవ్వు కరువైందని చెప్పవచ్చు.బిక్కు బిక్కు మంటూ వ్యాపారులు కొనుగోలు దారుల కోసం ఎదురుచూస్తూ కూచోవాల్సి వస్తుంది.