
ఎంపీపీ సిద్దరాములు.
నిజాంపేట: నేటి ధాత్రి
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుపై చేసిన వాక్యాలు వెనక్కి తీసుకోవాలని ఎంపీపీ దేశెట్టి సిద్ధ రాములు అన్నారు. మండల కేంద్రంలో ని స్థానిక పెద్దమ్మ ఆలయం వద్ద మంగళవారం రోజున మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెదక్ లో జరిగిన అల్లర్లు కొందరు కావాలని సృష్టించారని అన్నారు. అలాగే ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పై బీజేపీ నాయకుడు, స్థానిక జెడ్పిటిసి పంజా విజయ్ కుమార్ మాట్లాడడం సరైనది కాదని చేసిన వాక్యాలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మారుతి, నసీరోద్దీన్, పంజా మహేందర్, నరేందర్, అమర్ సేన రెడ్డి, వినోద్, వెంకటేష్ గౌడ్, లింగం గౌడ్ తదితరులు ఉన్నారు.