
జమ్మికుంట
జమ్మికుంట,: నేటి ధాత్రి
జమ్మికుంట లో హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వోడితల ప్రణవ్ కు రెండో విడుత దళిత బంధు నిధులు విడుదల చేయాలనీ వినతిపత్రం అందజేశారు. దళిత బందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సాధన సమితి సభ్యులు. జమ్మికుంట లో వోడితల ప్రణవ్ కలిసిన దళిత బంధు కాంగ్రెస్ పార్టీ సాధన కమిటీ మాజీ ప్రజా ప్రతినిధులు,కాంగ్రెస్ నాయకులు హుజురాబాద్ నియోజకవర్గం సభ్యులు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్బంగా వోడితల ప్రణవ్ మాట్లాడుతూ మీ సమస్య ను ముఖ్యమంతి రేవంత్ రెడ్డి,జిల్లా మంత్రులు దృష్టికీ తీసుకొని వెళ్లి నిధులు మంజూరు అయ్యే విధంగా కృషి చేస్తానని వారికీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సి డిపార్ట్మెంట్ రాష్ట్ర ఇంచార్జ్ అట్రాసిటీ రాష్ట్ర కన్వీనర్ తిప్పారపు సంపత్, సుంకరి రమేష్,పుల్లూరి స్వప్న సదానందం,బోయిని రాజకుమార్ ,అకినపల్లి సుజాత- భద్రయ్య ,రాచపల్లి సధయ్య చిలుముల వసంత- రామస్వామి ,సాలిగంటి సతీష్ బోయిని అంకుస్ ,నాగిల్ల ఓంకార్ కొండ్రు బిక్షపతి
బండారి శంకర్ బత్తుల లక్ష్మణ్ తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్య కర్తలు పాల్గొన్నారు.