
President Chityala Tirupati Reddy.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను…. ప్రజల్లోకి తీసుకువెళ్లాలి..
#స్థానిక ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీవే.
#మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపుకై ప్రతి కార్యకర్త నిస్వార్థం లేకుండా పనిచేయాలని మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని గొల్లపల్లి, కొండాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎర్ర నాగరాజు, కొండ నారాయణ అధ్యక్షతన జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశం లో తిరుపతి రెడ్డి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం లో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించి గ్రామం లో ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి చేసిన అభివృద్ధి పనులను ప్రజల వద్దకు తీసుకువెళ్ళి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కార్యకర్తలు సమన్వయం తో పని చేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలోకాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు చార్ల శివారెడ్డి ,మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్ ఇఫ్తార్ శేఖర్ గౌడ్ నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్దూరి తిరుపతి రావు ,మండలం పార్టీ ప్రధాన కార్యదర్శి మాలోత్ మోహన్, నాయకులు రఘు పతి రావు, జెట్టి రామూర్తి , బౌ సింగ్ , చిట్యాల ఉపేందర్ రెడ్డి, పోగుల కుమారస్వామి ,దూలపల్లి రవీందర్ రావు , వెంకన్న ,సంపత్ రావు ,రాజు తదితరులు పాల్గొన్నారు.