
Road Development Work
రామాయంపేటలో కోటి రూపాయల సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన..
రామాయంపేట, నేటి ధాత్రి (మెదక్)
రామాయంపేట మండల కేంద్రంలోని మూడవ మరియు నాలుగవ వార్డుల్లో రోడ్ల అభివృద్ధి పనులకు రూ. 1 కోటి వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్ల పనులను గురువారం నాడు ప్రారంభించారు.ఈ పనులు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆదేశాల మేరకు, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత రావు ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.వార్డుల్లో రోడ్ల పరిస్థితి గత కొంతకాలంగా తీవ్రంగా దెబ్బతినిన నేపథ్యంలో ఈ అభివృద్ధి పనులు ప్రజల్లో హర్షాతిరేకాలు నింపాయి.ఈ సందర్భంగా చౌదరి సుప్రభాత రావు మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడమే మా ప్రాధాన్యం.రోడ్డుపనుల ద్వారా ట్రాఫిక్ సౌకర్యం మెరుగవుతుంది.ఇది రామాయంపేట అభివృద్ధిలో మరో ముందడుగు అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.