`పిఠాపురంలో పవన్ ఒంటరిగా పోటీ చేయలేదు.
`టిడిపి బలంగా వున్న పిఠాపురంను పవన్ ఎంచుకున్నాడు.
`వర్మను బ్రతిమిలాడి సీటు కోరుకున్నాడు.
`చంద్రబాబును ఒప్పించి, వర్మను మెప్పించి తీసుకున్నారు.
`వర్మ ముందు వంగి వంగి ఆశీర్వాదం తీసుకున్నాడు.
`పవన్ కోసం వర్మ ఇళ్లిళ్లు తిరిగి ప్రచారం చేశారు.
`వర్మ కుటుంబమంతా తమ శ్రమను దారపోశారు.
`ఏరు దాటాక తెప్ప తగలేసే రకమని తెలిసినా సహకరించారు.
`పార్టీ కోసం వర్మ ఎవరూ చేయని త్యాగం చేశారు.
`వర్మ స్థానంలో మరెవరున్నా పవన్‌కు సీటు వచ్చేదే కాదు.
`వర్మ రెబల్ గా పోటీ చేస్తే పవన్‌కు డిపాజిట్ కూడా వచ్చేది కాదు.
`వాపు ఎప్పుడూ బలుపు కాదు.
`టిడిపి పొత్తు లేకుంటే జనసేనకు బతుకే లేదు.
`21 టిక్కెట్లు ఇచ్చినా జనసేన పోటీ చేసేందుకు అభ్యర్థులు దిక్కులేరు.
`వైసిపి నుంచి అరువు తెచ్చుకుంటే తప్ప అభ్యర్థులు దొరకలేదు.
`ఒంటరిగా నిలిచి గెలిచిన చరిత్ర జనసేనది కాదు.
`జనసేన కోసం 21 మంది టిడిపి నాయకులు బలయ్యారు.
`వారి త్యాగాలతో జనసేన అభ్యర్థులు గెలిచారు.
`టిడిపి త్యాగాల మీద జనసేన పదవులు అనుభవిస్తున్నారు.
`పదవులు ఇవ్వాల్సి వస్తే టిడిపి త్యాగధనులకు ఇవ్వాలి.
`పొత్తు పేరుతో ఇప్పటికే అర్హతకు మించి జనసేన లాభం పొందింది.
`ఇంకా ఒక్క పదవి జనసేనకు ఇచ్చినా టిడిపి నాయకులకు అన్యాయమే!
`పాముకు ఎంత పాలు పోసినా విషమే కక్కుతుంది.
`జనసేనకు ఇంకా ప్రాధాన్యత ఇస్తూ పోతే టిడిపి మునుగుతుంది.
`జనసేనకు సైనికులే సక్కగ లేరు.
`సినిమా అభిమానులంతా కార్యకర్తలు కాదు.
`జనసేనకు జనంలో ఆదరణే లేదు.
`ఇప్పటికీ మించి పోలేదు.. జనసేన చెవులు పిండకపోతే టిడిపికి మేలు జరగదు.
`ముందొచ్చిన చెవులకన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి సామెత నిజం చేసుకోవద్దు
హైదరాబాద్,నేటిధాత్రి:
జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా ఎమ్మెల్సీ నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఏపిలో కూటమి ప్రభుత్వంలో ఆరని మంటలు రాజేశాయి. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మనుద్దేశించి పరోక్షంగా నాగబాబు మాటలు తెలుగుదేశం శ్రేణుల్లో కలకలం రేపాయి. నాగబాబు చేసిన వ్యాఖ్యలకు ఆజ్యం పోసినట్లుగా ఏపి. డిప్యూటీ సిఎం. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపాయి. జనసేన నిలబడడమే కాకుండా, నలభైఏళ్ల తెలుగుదేశం పార్టీని కూడా నిలబెట్టామంటూ చేసిన పవన్ మాటలు మరింత మంటలు రేపాయి. అవి ఇప్పట్లో ఆరేలా కనిపించడం లేవు. ఎందుకంటే తాను చేసిన వ్యాఖ్యల్లో అంతర్ధాం అది కాదన్న మాట ఇప్పటికీ పవన్ కళ్యాణ్ చెప్పలేదు. ఆ మాటలకు పరోక్షంగా కట్టుబడి వున్నట్లుగానే ఆయన వ్యవహార శైలి వుండడం వల్ల తెలుగు తమ్ముళ్లలో కలవరం మొదలైంది. అక్కున చేర్చుకొని అందలమెక్కిస్తే తమకు పవన్ గుణపాఠం నేర్పాడంటూ, తనంటే మరోసారి రుజువు చేశాడని తెలుగు తమ్ముళ్లు అగ్గిమీద గుగ్గిలమౌతున్నారు. సరిగ్గా 2014 ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేక పొత్తు పేరుతో తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ మద్దతిచ్చారు. ఆ సమయంలోనూ సరిగ్గా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తెలుగుదేశం పార్టీ గెలుపుకు ప్రదాన కారణం జనసేన అని అప్పట్లోనే ఆయన బహిరంగంగా అనేక వేధికల ద్వారా చెప్పారు. తర్వాత కాలంలో తెలుగుదేశం పార్టీని, ఇటు బిజేపిని కూడా ఆయన అనేక సార్లు తూర్పార పట్టారు. తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టే ప్రసక్తి లేదని శపథాలు చేశాడు. ఏకంగా ఆ సమయంలో మంత్రి లోకేష్ పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నాడంటూ విమర్శలు గుప్పించిన ఘనత పవన్ కల్యాణ్‌ది. 2019 ఎన్నికల సమయంలో ఒంటరిగా పోటీ చేసిన జనసేనాని తెలుగు దేశం పార్టీ తన అభ్యర్ధులకు కోట్ల రూపాయలు ఎలా సమకూర్చిందంటూ ప్రశ్నించారు. ఇలా అడుగడుడునా తెలుగుదేశం పార్టీపై ఆరోపణలు చేస్తూ, ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. దాంతో 2014 ఎన్నికల్లో 60 సీట్లతో ప్రతిపక్ష హోదా సంపాదించున్న వైసిపి, 2019 ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి తెలుగుదేశం పార్టీ మీద పవన్ చేసిన ఆరోపనలు కూడా కారణమయ్యాయి. 2019 ఎన్నికల్లో ఒంటరిపోరుతో ఒక్క సీటు కూడా గెలవని పవన్ కళ్యాణ్ కూటమితో జతకట్టి మొదటిసారి ఎన్నికల్లో గెలుపొందారు. కాని ఆ విశ్వాసాన్ని పది నెలల్లోనే మర్చిపోయారు. విశ్వాస ఘాతుకానికి మరోసారి తెరతీశారు. పిఠాపురం సభలో నాగబాబు చేసిన వ్యాఖ్యలను అప్పుడే పవన్ ఖండిస్తే పరిస్దితి వేరుగా వుండేది. లేకుంటే నలభై ఏళ్ల టిడిపిని గెలిపించామని అనకపోయినా బాగుండేది. కాని అన్నదమ్ములిద్దరూ ముందే అనుకొని ఆ సభలో మాట్లాడినట్లు అర్ధమౌతోంది. తెలుగుదేశం పార్టీ తమ మీదే ఆదారపడి గెలిచిందని పరోక్షంగా పవన్ సంకేతాలు పంపినట్లైంది. కాని అది నిజమేనా? అంటే జనసైనికులు కూడా ఒప్పుకోవడానికి సిద్దంగా లేరు. ఒక్కమాటలో చెప్పాలంటే జనసేన సభకు తెలుగుదేశం పార్టీ సహకరించకపోతే ఆ సభ సక్సెస్ అయ్యేదా? ఇప్పుడు పవన్ కళ్యాన్ అదే పిఠాపురంలో మరో సభ నిర్వహించగలరా? నిజంగానే పవన్ పిఠాపురంలో తన స్వశక్తి మీదే గెలిచారా? వర్మ ఆ సీటును వదులకోవద్దని అనుకుంటే పవన్‌కు దక్కేదా? వర్మ తిరుగుబాటు అభ్యర్ధిగా పోటీచేస్తే పవన్‌కు కనీసం డిపాజిట్ దక్కేదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. ఎందుకంటే ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా పిఠాపురంలో పవన్ గెలుపు ముమ్మాటికీ తెలుగుదేశంనాయకుడు వర్మ పెట్టిన బిక్ష అని చెప్పకతప్పదు. ఆయన ఒక వేళ నాకెందుకు అని ప్రచారానికి మానుకున్నా పవన్ గెలుపు ఎప్పుడో గందరగోళంలో పడేది. వర్మ కనుసైగ చేస్తే ఆ ఓట్లు మరో పార్టీకి పడేవి. కాని ఆయన ఎంతో నిబద్దతతో పొత్తు ధర్మాన్ని పాటించారు. ఆ ఎన్నికల్లో తాను పోటీచేసినప్పుడు ఎలా ప్రచారం చేస్తారో అలాగే చేశారు. అంతే చిత్తశుద్దితో పనిచేశారు. ఎన్నిక నాది కాదన్న ఆలోచన ఆయనలో ఏ కోశాన కనిపించలేదు. అసంతృప్తి అసలే చెందలేదు. అందుకే ఆయన కుటుంబం మొత్తం పవన్ గెలుపుకోసం పనిచేశారు. వర్మ కుమారుడు కూడా ఎంతో కష్టపడి పవన్‌ను గెలిపించారు. వర్మ సతీమణి కూడా పవన్ గెలుపులో కీలకభూమిక పోషించారు. ఇలా వర్మకుటుంబం మొత్తం పనిచేసి పవన్‌ను గెలిపించారు. గెలిచిన తర్వాత పవన్ తన కృతజ్ఞతను కూడా తెలిపారు. ఆ సంగతి పవన్ మర్చిపోయినట్లున్నారు. వర్మ నుంచి ఆశిర్వాదం తీసుకున్నారు. తన గెలుపు బాధ్యతను తీసుకున్న వర్మ త్యాగాన్ని ఆనాడు పవన్ ఆకాశానికెత్తాడు. జీవితాంతం గుర్తుంచుకుంటానని చెప్పాడు. కాని పట్టు మని పది నెలలు గడవకముందే నాగబాబు తన వైఖరిని చూపించారు. పిఠాపురంలో పవన్ గెలుపు నావల్లనే అని ఎవరైనా అనుకుంటే అది వారి ఖర్మ అంటూ మాట్లాడడం కూటమి మధ్య బీటలు తెచ్చిపెట్టింది. ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయమేమిటంటే పవన్ పిఠాపురంలో జనసేన అభ్యర్ధిగాకంటే కూటమి అభ్యర్ధిగానే పోటీచేశారు. జనసేనకు పిఠాపురంలో కనీసం పార్టీ యంత్రాంగం కూడా లేదు. అక్కడ ఇల్లు లేదు. పవన్ లోకల్ కూడా కాదు. అయినా ప్రజలు ఆదరించారంటే పవన్‌ను చూసికాదు. కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్మను చూసి మాత్రమే ఓట్లేశారు. పవన్‌ను గెలిపించారు. గోదావరి జిల్లాలో టిడిపి బలంగా వున్న పిఠాపురంను పవన్ ఎంచుకోవడంలో కూడా ఒక కారణం వుంది. ఆయన గెలవాలంటే టిడిపి బలంగా వున్న నియోకవర్గం ఎంచుకోవాలని ముందు నుంచి లెక్కలేసుకున్నాడు. పిఠాపురంలో పోటీచేస్తే తెలుగుదేశం మద్దతు పూర్తిగా అందుతుందని తెలుసుకున్నాడు. అందుకే ఆ నియోజకవర్గాన్ని ఎంచుకున్నాడు. వర్మను బ్రతిమిలాడి ఆ సీటును తెచ్చుకున్నాడు. వర్మ ముందు వంగి వంగి దండాలు పెట్టి తెచ్చుకున్నాడు. పవన్ కళ్యాన్ అసలు నిజ స్వరూపం వర్మకు పూర్తిగా తెలుసు. అయినా పార్టీ కోసం వర్మ త్యాగంచేశారు. అదే సమయంలో శాసనసభ్యుల ఎమ్మెల్సీలలో మొదటి అవకాశం వర్మకే ఇస్తామని చంద్రబాబు కూడా హమీ ఇచ్చారు. కాని ఆ హమీని కూడా అందకుండా పవన్ పరోక్షంగా తన అన్నను తెచ్చిపెట్టాడు. వర్మకు ఎమ్మెల్సీ రాకుండా అడ్డుకున్నాడు. పిఠాపురంలో వర్మ ఎమ్మెల్సీగా వుంటే తన ప్రతాపం చెల్లదని గ్రహించాడు. తన నాయకత్వానికి నష్టం జరుగుతుందని తెలుసుకున్నాడు. అంందుకే పిఠాపురంలో మరో నాయకుడు లేకుండా చేయాలన్న ఆలోచనతో, నాగబాబుకు ఎమ్మెల్సీ ఇప్పించాడు. నిజానికి పార్టీ కోసం ఎవరూ చేయని త్యాగం వర్మ చేశారు. ఎందుకంటే ఆయన అప్పటికే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే. అలాంటి వర్మ సీటు కోరుకోవడం పవన్ తప్పు. ఆ సీటును టిడిపి పవన్‌కు కేటాయించడం కూడా స్వయంకృతాపరాధమే అని చెప్పాలి. వర్మ స్దానంలో మరో నాయకుడు ఎవరున్నా పవన్‌కు పిఠాపురం సీటు వచ్చేదే కాదు. అయినా వర్మచేసిన త్యాగాన్ని ఎగతాలి చేసిన నాగబాబు వాపును చూసి బలపనుకుంటున్నాడు. అసలు టిడిపికి జనసేనతో పొత్తు లేకున్నా అధికారంలోకి వచ్చేది. కాని ప్రభుత్వ ఓటు చేలకుండా సాయపడతా అని ఉడతా భక్తి చూపించి, మొత్తం నేనే చేశానంటూ పవన్ చెప్పుకోవడానికి తెలుగు తమ్ములు జీర్ణించుకోకుండా చేశారు. అసలు టిడిపితో పొత్తు అనేదిలేకుంటే, కూటమి అనేది కట్టకపోతే జనసేనకు బతుకేలేదు. ఈసారి కూడా పోటీచేసే పరిస్దితి వచ్చేది కాదు. ఆ విశ్వాసం జనసేనానికి లేకుండాపోయిందనేది అర్దమౌతోంది. జనసేనకు ఎంతో ఉదారతో 21 సీట్లు ఇచ్చినా కనీసం ఆ పార్టీ తరుపున పోటీ చేసేందుకు అభ్యర్ధులకే దిక్కులేని పార్టీ. వైసిపి నుంచి అరువు తెచ్చుకుంటే తప్ప పోటీకి అభ్యర్దులు దొరకలేదు. వైసిసి వద్దనుకొని, వదిలేసిన నాయకులను తెచ్చుకొని పోటీచేయించుకున్నాడు. అదికూడా టిడిపి దయతో వాళ్లంతా గెలిచారు. అది వాళ్లు మర్చిపోలేదు. కాని పవన్ మర్చిపోయారు. నాగబాబు అంతకన్నా మర్చిపోయారు. ఈ ఎన్నికల్లో ఒంటరిగా నిలిచిన చరిత్ర జనసేనది కాదు. ఒంటరిగా గత ఎన్నికల్లో పోటీచేసి ఒక్క చోట కూడా పవన్ గెలలేకపోయారు. జనసేన కోసం టిడిపికి చెందని 21 మంది నాయకులు బలయ్యారు. రాజకీయ జీవితం వదలుకున్నారు. ఒక రకంగాచెప్పాలంటే సమాది చేసుకున్నారు. పార్టీ గెలిచిందని టీ పార్టీ చేసుకోవడం తప్ప మిగిలిని సంతోషం వారికి లేదు. వారి త్యాగాలతో గెలిచిన జనసేన, లేని పోని గొప్పలు చెప్పుకుంటూ త్యాగాలను కించపర్చుతున్నారు. అందుకే పవన్‌ను ఏపి జనం చీ కొడుతున్నారు.