వీణవంక ,(కరీంనగర్ జిల్లా),
నేటిదాత్రి: వీణవంక మండల పరిధిలోని బేతిగల్ గ్రామానికి చెందిన వ్యక్తి కుర్ర సురేష్ తండ్రి మల్లయ్య(45) వయస్సు తన ఇంటి దగ్గర చిన్న గొడవ పెట్టుకొని ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల
సమయంలో బేతిగల్ గ్రామ శివారులోని పొలం వద్ద పురుగుల మందు అపస్మారక స్థితి లో పడి ఉన్నాడని 100 కు ఫోన్ చేయగా వెంటనే అప్రమత్తమైన బ్లూ కోల్ట్ పోలీసులు 10 నిమిషాల వ్యవధిలో సంఘటన స్థలానికి చేరుకొని పురుగుల మందు త్రాగిన వ్యక్తిని గమనించి పొలం గట్ల నుండి 2 కిలోమీటర్ల దూరం పోలీస్ సిబ్బంది జయపాల్ తన భుజాల మీద మూసుకొని బస్టాండ్ సమీపంలో ఉన్న ప్రైవేటు వాహనంలో జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్సై వంశీకృష్ణ తన పోలీస్ సిబ్బందిని అభినందించారు.అనంతరం చికిత్స పొందుతున్న వ్యక్తి తొందర కోలుకోవాలని అన్నారు.
