తంగళ్ళపల్లి నేటీ ధాత్రి
తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో చెందిన రుద్రపు పోచవ్వ అనారోగ్యం గురై జ్వరంతో బాధపడుతుండగా జిల్లెల్ల క్రాసింగ్ లోని ఆర్ఎంపీ డాక్టర్ లింగారెడ్డి వద్ద ట్రీట్మెంట్ చేయించుకుని ఇంజక్షన్ వేసుకుని తిరిగి వస్తున్న క్రమంలో మార్గమధ్యలో గుర్తుతెలియని వ్యక్తులు ఆడ మగ ఇద్దరుమోటార్ సైకిల్ పై వెళుతూ ఇంటి దగ్గర దిగబెడతామని చెప్పగా వారి మాటలు నమ్మి వారితో బండిమీద వెళ్ళగా వారు ఆమెను ఇంటి వద్ద దింపే క్రమంలో ఆమె మెడలోని పుస్తెలతాడును తెంపుకొని పారిపోయారు ఇట్టి విషయమై తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అట్టిఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా సిరిసిల్ల రూరల్ సదన్ కుమార్ ఆర్ఎస్ఐ జూ నైధ్. తన సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నేరెళ్ల జిల్లెల్ల క్రాస్ రోడ్ మల్లాపూర్ దేవాలయం పోతుగల్ ముస్తాబాద్ రేగులకుంట గ్రామాల్లో ఉన్న సిసిటీవీ ఆధారంగా నిందితులను గుర్తించి ఈనెల 26.01.2024.తేదీన. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో బ దనపల్లి క్రాస్ రోడ్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానం వచ్చి ఇద్దరు వ్యక్తులను ఇద్దరు అదుపులోకి తీసుకొని విచారించగా సిద్ధన యాదవ. భర్త ఓదెలయ్య 33 సంవత్సరాలు ఊరు పద్మనాభం పల్లి మండలం దుబ్బాక అని తేలింది వీరితోపాటు బోదాసునరేష్ తండ్రి ఎల్లయ్య 30 సంవత్సరాలు ఊరు పెద్ద గుండవెల్లి మండల దుబ్బాక అని వీరు ప్రస్తుతం సిద్దిపేటలో ఉంటున్నారని వీరు సులువుగా డబ్బులు సంపాదించాలని భావించి ఒంటరిమహిళలు లక్ష్యంగా చేసుకొని దోపిడీలకు పాల్పడుతున్నారని ఇట్టి విచారణలో ఒప్పుకోవడం జరిగిందని అనంతరం వీరిని ఈరోజు రిమాండ్కు తరలించడం జరిగిందని ఎస్పీ తెలిపారు ఇట్ట కేసును విచారణ చేసి కేసును చేదించిన పోలీసు సిబ్బందినిఎస్పీ అఖిల్ మహాజన్ వారికి రివార్డు అందజేసిఅభినందించారు