అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న నేపథ్యంలో సహకరిస్తున్న పోలీస్ శాఖ

వీణవంక: నేటి ధాత్రి
*మైనింగ్ అధికారుల అండదండలతో అక్రమ ఇసుక రవాణా వీణవంక మండలంలోని కోర్కల్ చల్లూరు మల్లారెడ్డి పల్లె పోతిరెడ్డి పల్లె కోండపాక.గ్రామాల్లో మానేరు వాగు గుండ అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న నేపథ్యంలో సహకరిస్తున్న పోలీస్ శాఖ
మామూళ్ల పర్వంలో ఇసుక రవాణాను అడ్డుకోవలసిన పోలీసులే వాహన యజమానులకు కాంట్రాక్టర్లకు సహాయంగా ఉంటూ హుజురాబాద్ గుండా వరంగల్ కాజీపేట హనుమకొండ వివిధ ప్రాంతాలకు తరలించుటలో సహాయపడుతున్నారు ఈ వ్యవహారంలో మానేరు రీచ్ మల్లారెడ్డిపల్లెలోని మైనింగ్ అధికారి అండదండలతోనే ఈ మాఫియా జరుగుతుంది అధిక ఇసుక రవాణాకు కాంట్రాక్టర్లు వీలైనన్ని ట్రాక్టర్లు వాగులలో పెడుతూ రాత్రి సమయంలో కూడా రవాణాను చేయటం వలన ఘన్ముఖలా క్రాస్ గద్దపాక రెడ్డిపల్లి లక్ష్మాజిపల్లి మల్లన్నపల్లి గ్రామాల వద్ద ఇసుక ట్రాక్టర్ యజమానులు ముందుగానే వచ్చి రోడ్డుపై ఎవరు ఉన్నది లేనిది చూసుకొని ట్రాక్టర్లను పంపించడం జరుగుతుంది ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక ట్రాక్టర్ల పై మరియు యజమానులపై తగిన చర్యలు తీసుకోగలరని స్థానికులు కోరటం జరుగుతుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *