భారత రాజ్యాంగాన్ని మారుస్తానన్న పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలి.

ఏ వై ఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో సోమవారం రోజున అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్ అద్యక్షతన జరిగిన సంఘం సమావేశంలో అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య మాట్లాడుతు 16 డిగ్రీలు పూర్తి చేసి 16 డిగ్రీ పట్టాలు పొందిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగిందని తెలిపారు. ఆ భారత రాజ్యాంగం ఆమోదం పొంది అమల్లోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలనను కొనసాగిస్తున్నాయని చెప్పారు. ఈ భారత రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగులు పాఠశాలలో మరియు వార్డు సభ్యులు మొదలు కొని రాష్ట్రపతి వరకు రిజర్వేషన్ల ద్వారా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్క కార్యక్రమం కొనసాగుతోందని అన్నారు. ఈ రాజ్యాంగమే భారత దేశానికి దిక్సూచి అని తెలిపారు. మనకు రాజ్యాంగమే లేకపోతే అనేక ఇబ్బందులు పడేవారమని అన్నారు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమాన న్యాయం ఈ రాజ్యాంగం ద్వారా జరుగుతుందని తెలిపారు
ఈ పార్లమెంటు ఎన్నికల్లో బిజెపికి 400ల సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తామనడం సరియైనది కాదని అన్నారు. ఈ రాజ్యాంగం ప్రకారమే 75 సంవత్సరాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలనను కొనసాగించిందన్నారు ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుస్తే రాజ్యాంగాన్ని మారుస్తామనడం సిగ్గు చేటన్నారు భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన ఓటు తో బడుగు బలహీన వర్గాలందరు ఏకమై ఆ పార్టీకి తగిన బుద్ది చెబుతామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రచార కార్యాదర్శి గుర్రపు రాజేందర్ జిల్లా సాంస్కృతిక కార్యాదర్శి జన్నే యుగేందర్ మండల ప్రధాన కార్యదర్శి మ్యాదారి సునీల్ ఉపాధ్యక్షుడు కట్కూరి శ్రీనివాస్ నాయకులు పుల్ల ప్రతాప్ గురుకుంట్ల కిరణ్ గడ్డం సదానందం ఆరేపెల్లి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!