వనపర్తి నేటిధాత్రి :
దేశంలో బిజెపిని నిలువరించాల్సిన బాధ్యత కమ్యూనిస్టులపైనే ఉన్నదని సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.బాల నరసింహ అన్నారు. వనపర్తి సిపిఐ జిల్లా కార్యాలయంలో సిపిఐ జిల్లా విస్తృత కౌన్సిల్ సమావేశం గోపాల్ అధ్యక్షతన జరిగింది. బాల నరసింహ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మల్కాజ్గిరి లో వేరే ప్రాంతం అభ్యర్థిని పెట్టటం కాంగ్రెస్కు మైనస్ అయిందని అన్నారు . గ్రామ మండల జిల్లా నిర్మాణ సభలను త్వరగా పూర్తిచేయలన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి కళావతమ్మ, రాబర్ట్, మోష, జే చంద్రయ్య, రమేష్, అబ్రహం, శ్రీరామ్ ,గోపాలకృష్ణ, గోపాల్, ఏ రవీందర్, శ్రీహరి, సీఎన్ శెట్టి, శాంతన్న, బాలరాజు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
బిజెపిని నిలువరించే బాధ్యత కమ్యూనిస్టులపైనే ఉన్నది
