
"Fight for 42% BC Reservations"
పోరాట మార్గంతోనే సమస్యల పరిష్కారం.
42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి
ఈనెల 11న కలెక్టరేట్ వద్ద ఆందోళన
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కామ్రేడ్ ఓంకార్ పాత్రపై ఈనెల 12న రాష్ట్ర సదస్సు
ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్
వరంగల్ జిల్లా ప్రతినిధి/ నర్సంపేట,నేటిధాత్రి:
కేంద్రంలో,రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యంతో పేరుకుపోతున్న స్థానిక సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గమని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ పిలుపునిచ్చారు. మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తూ గందరగోళపరుస్తున్న భారతీయ జనతా పార్టీ తీరు పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు.ఎంసిపిఐ(యు) నగర ముఖ్య కార్యకర్తల సమావేశం నగర కార్యదర్శి కామ్రేడ్ మాలోత్ సాగర్ అధ్యక్షతన వరంగల్ పార్టీ ఆఫీసులో జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ మాట్లాడుతూ 42 శాతం బీసీ రిజర్వేషన్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.బీసీలను మభ్యపెడుతూ కపటనాటకం ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే తమిళనాడు రాష్ట్రంలో వలె షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చి 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయవచ్చని డిమాండ్ చేశారు.రాజకీయ స్వార్థం కోసం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుండా నిర్వీర్యం చేస్తూ నిధులు కేటాయించకుండా స్థానిక సమస్యలు పేరుకుపోయే విధంగా పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వం కారణమవుతున్నారని పేర్కొన్నారు. అందుకని తక్షణమే 42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 11న వరంగల్ కలెక్టర్ ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. వీర తెలంగాణ రైతాంగ పోరాట వారోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు కార్యక్రమాలు చేపట్టాలని అలాగే అమరజీవి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ శత జయంతి వార్షికోత్సవంలో భాగంగా తెలంగాణ రైతన్న సాయుధ పోరాటంలో ఓంకార్ పాత్రపై ఈనెల 12న తొర్రూరులో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ నెల 17న వారోత్సవ ముగింపు ప్రదర్శన సదస్సు వరంగల్ పట్టణంలో జరుగుతుందని కాగా కార్యకర్తలు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం 12న జరిగే రాష్ట్ర సదస్సు ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ నగర సహాయ కార్యదర్శి సుంచు జగదీశ్వర్, నగర నాయకులు ముక్కెర రామస్వామి, గణిపాక ఓదెలు, మహమ్మద్ మహబూబ్ పాషా, మాలి ప్రభాకర్, అప్పనపురి నర్సయ్య, తాటికాయల రత్నం, పోలేపాక రవీందర్, దామెర రమేష్ తదితరులు పాల్గొన్నారు.