మహిళలకు గొప్ప అవకాశం కౌన్సిలర్ రమేష్
పరకాల నేటిధాత్రి(టౌన్)
హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సౌజన్యంతో పరకాల శాసనసభ్యులు చల్ల ధర్మారెడ్డి ఆదేశానుసారం శుక్రవారం రోజున పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 9,10,11,20 మరియు 21 గల వార్డులకు చెందిన మహిళా సోదరీమణులకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ శిబిరాన్ని మాదారం అంబేద్కర్ కమ్యూనిటీ భవనంలో పరకాల మున్సిపాలిటీ చైర్ పర్సన్ సోద అనిత రామకృష్ణ వైస్ చైర్మన్ రేగూరి జయపాల్ రెడ్డి స్థానిక కౌన్సిలర్ పసుల లావణ్య రమేష్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ రామంచ రాజు,మానస, ట్రైనర్స్ జిల్లెల్ల రమ్య,సంఘవి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.