ఎఈ వరలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన బోల్లంపల్లి సంతోష్ గౌడ్
ముత్తారం :- నేటిధాత్రి
ముత్తారం పంచాయతీరాజ్ ఏఈ పై చర్యలు తీసుకుంటూ నాణ్యత తో కూడిన సీసీ రోడ్లు వేసేలా చూడాలని పెద్దపల్లి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కు ఫిర్యాదు
ముత్తారం మండల పరిధిలోని ఎన్ఆర్ఈజీఎస్ పనులు నాణ్యతలేని మెటీరియల్ జరుగుతున్నాయని, భారీ అవినీతి చోటుచేసుకుందన్నారు.
ఉపయోగించాల్సిన వైబ్రేటింగ్ యంత్రాన్ని ఉపయోగించటం లేదన్నారు 2. రోడ్డు వేయడంలో ఇసుకను ఎక్కువగా వాడుతున్నారని కాంక్రీటు కంకరను తక్కువగా ఉపయోగిస్తారు.3. నాణ్యమైన మెటీరియల్ రోడ్డు 7 అంచులలో ఎక్కువగా ఉపయోగించబడుతుంది రహదారి మధ్యలో 3 ఇంచులు వేస్తున్నారు,4. సరైన తనిఖీ చేయని పిఆర్ ఎఈ వరలక్ష్మి,5. రోడ్డు వేయడానికి ముందు రోడ్డుపై రాతి చిప్‌లు వేయటం లేదు.6.నాణ్యతతో కూడిన రోడ్ల గురించి ప్రజలు అధికారులను అడిగినప్పుడు వారు ఫిల్తీ భాషలో దుర్భాషలాడారు నిష్పక్షపాతంగా వివక్ష చూపుతూ కాంట్రాక్టర్స్ వత్తాసు పలుకుతున్న ఎఈ వరలక్ష్మి 7. సరైన నీటి క్యూరింగ్ కూడ చేస్తలేరు 8. సిమెంట్ మెటీరియల్‌లో రోడ్లు వేయడంలో తక్కువ స్థాయి నాణ్యతను ఉపయోగిస్తున్నారనీ
బొల్లంపల్లి సంతోష్ కుమార్ గౌడ్. ఆవేదన వ్యక్తం చేస్తూ ముత్తారం పీఆర్ ఎఈ వరలక్ష్మి పైన చర్యలు చెపట్టాలని డిమాండ్ చేశారు ,