మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు గ్రీవెన్స్ లో వినతి పత్రం అందజేసిన నిరుద్యోగుల అసోసియేషన్ సభ్యులు

మంచిర్యాల నేటి ధాత్రి

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కి ఆర్ట్ ,క్రాఫ్ట్, మ్యూజిక్ పోస్ట్లను తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీలో 1733 పోస్టులు భర్తీ చేయాలని మంచిర్యాల జిల్లా ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ నిరుద్యోగుల అసోసియేషన్ తరపున రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
గత 35 సంవత్సరాలుగా వివిధ ప్రభుత్వాలు నిర్వహించిన డీఎస్సీ ఆర్ట్ లలో ఖాళీగా ఉన్న 1733 ఆర్ట్ ,క్రాఫ్ట్ ,మ్యూజిక్ పోస్టులను భర్తీ చేయాలనే ఆలోచనే లేకుండా ఏ ప్రభుత్వానికి లేదు ఫలితంగా లోయర్ ,హయ్యర్ ,టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ కోర్స్ మరియు బి ఎఫ్ ఏ,ఏం ఎఫ్ ఏ పూర్తిచేసిన అభ్యర్థులం దాదాపుగా లక్ష మందికి పైగా రోడ్డున పడి ఉన్నాము మాకు ప్రభుత్వం నుండి గాని ప్రైవేట్ రంగాల్లో గాని ఉపాధి లేక కళను నమ్ముకొని నలుగురికి విద్యార్థులకు పంచే అవకాశం లేక మా జీవితాలు అంతా ప్రమాదకర స్థితిలో కొనసాగుతున్నాయి. కాబట్టి నిరుద్యోగుల పట్ల ఎంతో బాధ్యతతో తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ద్వారా నిర్వహించబోయే డీఎస్సీలో ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ పోస్టులను ప్రకటించి మా కళాకారుల జీవితాలలో వెలుగులోను నింపుతారని ఆశిస్తున్నాము మా న్యాయపరమైన డిమాండ్స్
1).మీరు నిర్వహించే డీఎస్సీలో ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ పోస్టులను ప్రకటించాలి
2).ప్రతి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో ఖచ్చితంగా ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ ఉద్యోగులను నియమించేలా చర్యలు తీసుకోవాలి
3. అభ్యర్థులకు వయోపరిమితి యందు సడలింపు ఇవ్వాలి
4. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కళలకు సంబంధించి ప్రతి స్కూల్లో హార్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ పోస్టులను కూడా నింపాలి.
మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చిన వారిలో మద్దూరి రాజు యాదవ్ తెలంగాణ ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ నిరుద్యోగుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మంచిర్యాల జిల్లా జాయింట్ సెక్రెటరీ గద్దల సునీల్,
మంచిర్యాల జిల్లా జాయింట్ సెక్రెటరీ ఏం దివ్య,
మంచిర్యాల జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ గద్దల రాజగోపాల్, మంచిర్యాల జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ నీరటి జనార్ధన్, మంచిర్యాల జిల్లా కోశాధికారి కంపెల భీమేష్ హార్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ మంచిర్యాల జిల్లా తదితరులు నిరుద్యోగులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *