
Chief Minister Revanth Reddy
బల్దియా నిధులను బర్బాద్ చేస్తున్న మేయర్..? “సీఎం” ఆదేశాలు బేకతార్!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించండి. వరంగల్ మేయర్ నిధుల దుర్వినియోగంపై ఆరా తీయండి అని వేడుకుంటున్న వరంగల్ ప్రజలు
వరంగల్ మున్సిపల్ నిధుల దుర్వినియోగంపై పూర్తి కథనం త్వరలో.. మీ”నేటిధాత్రి”లో..
“నేటిధాత్రి”, వరంగల్.
రాష్ట్రంలోని అధికారులు, నాయకులు వర్షాలు, వరదల విషయంలో అందరూ అందుబాటులో ఉండాలి అని ఒకపక్క సీఎం చెబుతుంటే, వరంగల్ మేయర్ మాత్రం స్టడీ టూర్ పేరుతో నగరాన్ని పట్టించుకోకుండా తన సొంత లాభం కోసం కార్పోరేటర్లని పట్టుకొని విహారయాత్రలకు వెళ్తుండటం వివాదాస్పదంగా మారింది.
మళ్లీ గెలవాలనే తాపత్రయంతో కార్పోరేటర్ లను మచ్చిక చేసుకోవడానికి కోసం స్టడీ టూర్ పేరుతో, ప్రజల సొమ్ముతో విహారయాత్ర?
గ్రేటర్ వరంగల్ నగర సమస్యలు గాలికి వదిలేసి “ఇండోర్ స్టడీ టూర్ కు ఏర్పాట్లు”
గ్రేటర్ వరంగల్ నగరంలో రోడ్లు బాగాలేక, అనేక సమస్యలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతుండగా, వరంగల్ మున్సిపల్ పాలకవర్గం ఇండోర్ స్టడీ టూర్ పై అడుగులు వేయడం నగరవాసులు, ప్రతిపక్షాల్లో చర్చనీయాంశమైంది.
సుమారు 55మంది కార్పొరేటర్లు, మేయర్‌తో పాటు అధికారులు 25మంది కలిసి స్టడీ టూర్ పేరుతో (విహారయాత్ర) వెళ్ళడానికి ఏర్పాట్లు జరుగుతుండటంపై ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
టూర్ ఖర్చు దాదాపు 50లక్షల రూపాయల పైవరకు వెళ్తుందని వినిపిస్తోంది. ఈ మొత్తాన్ని ప్రజల సొమ్ముతో ఖర్చు చేయడం సమంజసమా అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒకపక్క నగర ప్రజలు వరదల నుండి తేరుకోక ముందే విహార యాత్రలు ఎందుకు? మరోవైపు రాబోయే ఐదు రోజులు మళ్లీ భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణశాఖ హెచ్చరికలు.
మున్సిపల్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వర్షాల సమయంలో అప్రమత్తంగా నాయకులు నగరాల్లో అందుబాటులో ఉండాలని చెప్తే, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అందుబాటులో ఉండాల్సిన నాయకులు స్టడీ టూర్ పేరు మీద విహారయాత్రలా అని ఆగ్రహిస్తున్న ప్రజలు
మునిసిపల్ శాఖలో నిధులు లేవంటూనే, స్టడీ టూర్లు పెట్టి, విహార యాత్రలు చేస్తూ, ప్రజలు కడుతున్న పన్నులను విహారయాత్రలకు వినియోగిస్తోంది నగర మేయర్ అంటూ ఆరోపిస్తున్న ప్రతిపక్షాలు
నగర మేయర్ మీకిది తగునా? నగర సమస్యలు పట్టవా? అంటూ ప్రశ్నిస్తున్న సామాన్యులు..
వరదలు వచ్చి, ఇప్పటికీ తేరుకొని నగరవాసులు. మరోసారి మేయర్ పదవి కోసమేనా ఈ టూర్? ఇంత ఖర్చు పెట్టడం అవసరమా? అంటున్న ప్రతిపక్షాలు..
నగరంలో సమస్యలు అనేకం ఉన్నాయి.. ఇప్పుడు ఇంత భారీ బృందం, టూర్ పేరుతో ఇండోర్ వెళ్ళడం, వరంగల్ ప్రజల డబ్బు వృథా చేయడమేనంటూ విమర్శకులు మండిపడుతున్నారు.
“నగరంలోనే పరిష్కరించాల్సిన అంశాలు పరిష్కరించలేకపోతూ, ఇండోర్ స్టడీ టూర్ అవసరమా?” అనే ప్రశ్న ముందుకు వచ్చింది.
పోయిన సారి సెల్ ఫోన్లు పంపిణీ చేయడం వివాదాస్పదమైంది. 10 వేల ఫోనుకు 30,000 బిల్లు పెట్టింది అని విమర్శలు వచ్చాయి? ప్రజల సొమ్ముతో సెల్ ఫోన్లు కొనివ్వడం ఏంటి అనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పటికీ సెల్ ఫోన్ల వెనుక పెద్ద ఎత్తున దండుకున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి
టూర్ ఖర్చులు, సెల్ ఫోన్ల ఖర్చులు.. నగర “మేయర్” ఈ ఖర్చులపై ప్రజలకు మీడియా ద్వారా సమాధానం ఇవ్వాలంటూ సామాన్యుల నుండి స్వరాలు వినిపిస్తున్నాయి.