మందమర్రి, నేటిధాత్రి:-
ప్రస్తుత కాలంలో వివాహ బంధం ఎక్కువ రోజులు నిలబడలేక పోతోంది. పెళ్లయిన రెండు మూడేళ్లకే విడాకులు తీసుకుంటూ ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. వివిధ కారణాలు విడాకులకు దారి తీస్తున్నాయి.
పెళ్లి అందమైన ప్రయాణం.
ఒకరి కోసం ఒకరు అనే విధంగా జీవితాన్ని అల్లుకొని మధురమైన బంధం. కానీ ప్రస్తుత కాలంలో వివాహ బంధం ఎక్కువ కాలం నిలబడటం లేదు. ఎంతోమంది భార్యాభర్తలు ఇక వీరితో తాము జీవించలేమంటూ.. విడిపోవడానికి సిద్ధమవుతున్నారు. అయితే విడాకులు తీసుకోవడానికి ఎక్కడ పొరపాటు జరుగుతోంది. లోపం ఎక్కడుందో తెలుసుకుంటే శారీరకంగా, మానసికంగా మహిళలపై భాగస్వాముల హింస పెరగడంతో వారు పూర్తిగా విరక్తి చెంది, గృహహింస తట్టుకోలేక వారి భాగస్వాముల నుంచి విడాకులు తీసుకుంటున్నారు.
నమ్మకం:
వివాహ బంధం కలకాలం నిలబడాలంటే భార్యాభర్తల మధ్య నమ్మకం ఉండాలి. ఈ నమ్మకం వివాహ బంధంలో లేకపోతే భార్యాభర్తల వందమంది అనుమానం అనే బీజం మొలుస్తుంది. దాంతో వారిద్దరి మధ్యన తరచుగా గొడవలు జరిగి మనస్పర్ధలు వస్తాయి. అటువంటి సమయంలో వివాహ బంధం కడవరకు నిలబడదు. ఎలాంటి విషయాన్నయినా దాచుకుండా భార్యాభర్తలు పంచుకుంటేనే ఆ బంధం బలంగా ఉంటుంది. బంధం మధ్యలోనే విడిపోతుంది.
చెడు అలవాట్లు: చిరు అలవాట్లు వ్యసనాలు ఉన్న జీవిత భాగస్వామితో జీవిత ప్రయాణాన్ని ఎక్కువ రోజులు కొనసాగించడం కష్టం. మద్యం డ్రగ్స్ అలవాటు ఉన్న భాగస్వాములను విడిచి పెట్టడానికి మహిళలు వెనకాడడం లేదు. ఇలాంటి అలవాట్లు ఉంటే కుటుంబంలో ఆర్థిక సమస్యలు కూడా తలెత్తుతాయి. తద్వారా విడాకులకు దారితీస్తుంది.
కుటుంబ సమస్యలు: భార్యాభర్తల మధ్యన వచ్చే ప్రతి చిన్న విషయానికి కూడా కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోవడం, వారి విషయాల్లో ఎక్కువగా కల్పించుకోవడం లాంటివి చేస్తే వారి మధ్యన దూరం మరింత పెరుగుతుంది. కాబట్టి కుటుంబ సభ్యులు అవసరానికి మించి భార్యాభర్తల విషయాల్లో తొంగి చూస్తే, వారి మధ్య గొడవలు మనస్పర్ధలు వస్తాయి. వారి కుటుంబ సభ్యుల ప్రవర్తన కూడా విడాకులకు కారణం కావచ్చు.
సరియైన భావవ్యక్తీకరణ లేకపోవడం: వైవాహిక బంధంలో సరైన భావవ్యక్తీకరణ లేకపోతే ఆ బంధం బీటలు వారేలా చేస్తుంది. కుటుంబ సమస్యలైనా… ఆర్థిక సమస్యలైన భార్యాభర్తలిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటేనే బంధం బలంగా ఉంటుంది. లేకపోతే ఆ బంధం శాశ్వతంగా దూరమవుతుంది.
అడ్వకేట్ రాజలింగు మోతే సఖ్యత ఫ్యామిలీ కౌన్సిలింగ్, ఆర్బిట్రేషన్ సెంటర్ -9676761221