వీరమల్లుకు క్రిష్‌ విషెస్…

వీరమల్లుకు క్రిష్‌ విషెస్…

చిత్రసీమలో నాన్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ గా క్రిష్ కు పేరుంది. గతంలో ఆయన కంగనా రనౌత్ నిర్మించిన ‘మణికర్ణిక’ చిత్రం నుండి మధ్యలోనే తప్పుకున్నారు. అలానే పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ మూవీ నుండి కూడా ఆయన అర్థంతరంగా వైదొలగారు. అయినా… ఈ సినిమా విడుదల వేళ చిత్రబృందానికి క్రిష్ విషెస్ తెలిపారు.

‘హరి హర వీరమల్లు’ (Harihara Veeramallu) అనేది ప్రముఖ దర్శకుడు క్రిష్‌ (Krish) బ్రెయిన్ చైల్డ్. సీనియర్ నిర్మాత ఎ.ఎం. రత్నం (A.M. Ratnam) కు సినిమా చేస్తానని మాట ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రకరకాల కథలు విన్నారు. కొన్ని రీమేక్స్ మీద దృష్టి పెట్టారు. చివరకు క్రిష్ చెప్పిన హరిహర వీరమల్లు కు కథకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అప్పటి నుండి సినిమా సెట్స్ పైకి వెళ్ళే వరకూ క్రిష్‌ ఎంతో హోమ్ వర్క్ చేశారు. ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి (Thota Tarani) తో పాటు సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ తో పాటు చర్చోపచర్చలు జరిపారు. ఈ కథ 17వ శతాబ్దానికి చెందిన ఓ యోధుడిది కావడంతో ఆ సమయానికి సంబంధించిన యుద్ధ విద్యలలో పవన్ కళ్యాణ్‌ సైతం శిక్షణ తీసుకున్నారు. భారీ అంచనాలతో మొదలైన ‘హరిహర వీరమల్లు’ నిర్మాణం ఊహించని విధంగా ఆలస్యమైంది. మధ్యలో కరోనా మహమ్మారి సైతం రెండు సార్లు వచ్చి వెళ్ళిపోయింది.

వేరే ప్రాజెక్ట్ లతో పాటు వ్యక్తిగత కారణంగా ఈ ప్రాజెక్ట్ నుండి క్రిష్‌ తప్పుకోవడంతో దీనిని పూర్తి చేసే బాధ్యతను ఎ. ఎం. రత్నం తనయుడు జ్యోతికృష్ణ (Jyothi Krishna) భుజానికి ఎత్తుకున్నాడు. ఈ సినిమాను క్రిష్ అంగీకారంతోనే జ్యోతికృష్ణకు అప్పగించామని అప్పట్లోనే రత్నం ప్రకటించారు. కానీ క్రిష్ మాత్రం దీని గురించి ఇప్పటి వరకూ పెదవి విప్పలేదు. ఆయన తనంతగా తాను బయటకు వెళ్ళారా? లేక వెళ్ళాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయా? అనే విషయంలో క్లారిటీ లేదు. ఇంతవరకూ జరిగిన ఫిల్మ్ పబ్లిసిటీలో జ్యోతికృష్ణ పేరుతో పాటు క్రిష్ పేరునూ దర్శకుడిగా ఉదహరిస్తూనే ఉన్నారు. సోమవారం ఉదయం జరిగిన ‘హరిహర వీరమల్లు’ ప్రెస్ మీట్ లోనూ, అదే రోజు సాయంత్రం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లోను నిర్మాత రత్నంతో పాటు పవన్ కళ్యాణ్‌ సైతం క్రిష్‌ సేవలను పొగిడారు. ఈ సినిమా రూపకల్పనలో క్రిష్‌ కృషి ఎంతో ఉందని చెప్పారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version