GHMC Council Approves Mega Budget for 2026-27
ముగిసిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ చివరి మీటింగ్.. మెగా బడ్జెట్‌కు ఆమోదం..
మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్ఎంసీ చివరి కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.11,460 కోట్ల బడ్జెట్‌కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పాలక మండలి పదవీకాలం ఫిబ్రవరి 10తో ముగియనుంది. ఈ నేపథ్యంలో శనివారం చివరి కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.11,460 కోట్ల బడ్జెట్‌కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. సమావేశంలో వివిధ పార్టీల కార్పొరేటర్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేసీఆర్ హయాంలో జీహెచ్ఎంసీ అప్పుల పాలైందని, అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళన చేశారు. అయితే మేయర్ గద్వాల విజయలక్ష్మి నచ్చచెప్పడంతో ఇరు పార్టీల కార్పొరేటర్లు సర్దుమణిగారు. అనంతరం 2026-27 బడ్జెట్‌కు కౌన్సిల్ ఆమోద ముద్ర వేసింది.
