
Jana Jatara Sabha
కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ
బాలానగర్ /నేటి ధాత్రి:
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం కలెక్టర్ విజయేందిర బోయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరతపై ఆరా తీశారు. సిబ్బంది సమయపాలన పాటించి ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాదగా ప్రవర్తించి రోగులకు ఉచిత వైద్యం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యురాలు నేహా ఫరీద్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.