
Youth Fix Borewell to Solve Colony Water Shortage
సొంత ఖర్చులతో బోర్ వెల్ మోటార్ ఏర్పాటు చేసిన యువత
జైపూర్,నేటి ధాత్రి:
సొంత ఖర్చులతో బోర్ వెల్ మోటార్ ఏర్పాటు చేసి కొత్తగూడెం కాలనీ వాసులకు నీటి కష్టాలు తొలగించిన యువకులు.జైపూర్ మండలం ముదిగుంట గ్రామంలోని కొత్తగూడెం కాలనీలో బోర్ వెల్ మోటార్ చెడిపోయి కాలనీ వాసులు గత రెండు నెలలుగా నీటి కష్టాలు ఎదుర్కొంటున్నామని అధికారుల దృష్టికి,ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఎవరూ కూడా పట్టించుకోలేదు అని గ్రామస్తులు వాపోయారు.ఈ విషయం తెలుసుకున్న ముదిగుంట గ్రామానికి చెందిన యువకులు స్వచ్ఛందంగా ముందుందుకు వచ్చిన యువకులు గుండా సురేష్ గౌడ్,ఆకుల రవికుమార్,జిల్లాల శ్రీకాంత్,దూగుట రాజశేఖర్ వారి సొంత ఖర్చులతో కొత్త మోటర్ బిగించి కాలనీవాసులు ఎదుర్కొంటున్న నీటి సమస్యకు పరిష్కార మార్గం చూపారు.ఈ సందర్భంగా యువత మాట్లాడుతూ.. గ్రామంలో ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే తమ వంతుగా కృషిచేసి సమస్య పరిష్కారం అయ్యేలా చేస్తామని అన్నారు.అలాగే కొత్తగూడెం కాలనీ వాసుల నీటి కష్టాలు తొలగిపోవడంతో యువకులకి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.