మరోసారి తెరపైకి తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల సమస్య..

మరోసారి తెరపైకి తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల సమస్య

 

 

 

కుమరం భీం జిల్లాలోని 12 గ్రామాలు రెండు రాష్ట్రాల పరిధిలో ఉంటాయి. ఇటు తెలంగాణ అటు మహా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ గ్రామాలు మావంటే మావేనంటూ మూడున్నర దశాబ్దలుగా పోటాపోటీగా ఇక్కడ పాలన చేస్తున్నాయి.

కుమరం భీం జిల్లాలోని 12 గ్రామాలు రెండు రాష్ట్రాల పరిధిలో ఉంటాయి. ఇటు తెలంగాణ (Telangana) అటు మహారాష్ట్ర (Maharashtra) ప్రభుత్వాలు ఈ గ్రామాలు మావంటే మావేనంటూ మూడున్నర దశాబ్దలుగా పోటాపోటీగా ఇక్కడ పాలన చేస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల వేళ (Panchayat Elections) మరోసారి కుమరం భీం అసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండలంలో ఉన్న తెలంగాణ మహరాష్ట్ర సరిహద్దుల్లోని వివాదాస్పద గ్రామాలు తెరపైకి వచ్చాయి.
రెండు ప్రభుత్వాలు ఇక్కడ ఇంటింటికీ రేషన్ కార్డులు ఇచ్చాయి. రేషన్ షాపులూ ఏర్పాటు చేశాయి. రెండు ప్రభుత్వాలు పాఠశాలలను ఏర్పాటు చేశాయి. ఇక్కడ రెండు ప్రభుత్వాలకు సంబంధించిన ఓటరు ఐడీ కార్డులను ఓటర్లు పొంది ఉన్నారు.ఆ గ్రామాల నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సర్పంచులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఆ గ్రామాల్లో అన్నీ డబుల్ ధమాకే..

తెలంగాణ, మహారాష్ట్ర మధ్య వివాదస్పందంగా మారిన ఆ 12 గ్రామాల ప్రజలకు అన్నీ డబుల్ ధమాకే. రెండురెండే ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు మహారాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు మొదలుకుని పాఠశాలలు, రహదారులు, తాగు నీటి పథకాల వరకు అన్ని రెండు మంజూరు చేస్తూ వస్తున్నాయి. ఒకే గ్రామానికి ఇద్దరు సర్పం‌చ్‌లు, రెండు పాఠశాలలు, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ముఖ్యమంత్రులు అన్నట్లుగా అటెండర్‌ను మొదలుకుని ఐఏఎస్ దాకా అన్నీ డబుల్ ధమాకే. ఆ ఊర్లలో అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంటుంది. ఇంకా విచిత్రమేమిటంటే తెలంగాణ నుంచి సర్పంచ్‌గా పనిచేసిన వ్యక్తే మహారాష్ట్ర ఎన్నికలు రాగానే ప్లేట్ ఫిరాయించి మహారాష్ట్ర నుంచి ఎన్నిక కావడం ఈ గ్రామాల విశిష్టత.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version