`ట్రాన్స్పోర్ట్ ట్రక్ షీట్లు.. సివిల్ సప్లై కి తూట్లు?
ట్రాన్స్పోర్ట్ ట్రక్ షీట్లు కట్.. ‘‘వేలకోట్లు’’ ఫట్!

`సివిల్ సప్లై శాఖలో మూడవ కంటికి తెలియని ‘‘వేలకోట్ల’’ కుంభకోణం?
’’మంత్రి’’ కే కాదు ‘‘కమీష్ నర్’’ కి కూడా తెలియని యవ్వారం?
’’మంత్రిగారు’’ తక్షణమే ‘‘సిబిఐ ఎంక్వైరీ’’ తోపాటు ‘‘స్పెషల్ ఆడిట్’’ జరిపించాలి.
`అవినీతికి పాల్పడ్డ అధికారులను, కాంట్రాక్టర్లను కటకటాల పాలు చేసి అవినీతి సొమ్ము కక్కించాలి.
`ట్రాన్స్పోర్ట్ ట్రక్ షీట్లు కట్ చెయ్ వేలకోట్లు దోచేయ్?
`కాంట్రాక్టర్ల తో చేతులు కలిపేయ్ ‘‘ట్రాన్స్పోర్ట్ ట్రక్ షీట్లు’’ కట్ చెయ్?
లారీలు లేని, రాని లెక్కలు రాసేయ్ కాంట్రాక్టర్ లకు పంచెయ్?
`కమీషన్ పట్టేయ్… కోట్లు వెనకేయ్?
`సివిల్ సప్లై అధికారుల అవినీతికి రాచ మార్గం.
`మూడో కంటికి తెలియని అతిపెద్ద కుంభకోణం?
కమీషన్లే కోట్లు వస్తున్నపుడు అధికారులకు జీతాలేంత?
`జీవిత కాల సంపాదన ఏడాది లో సంపాదిస్తున్న అధికారులు?
`కాంట్రాక్టర్ లకు కోట్లు దోచిపెడుతున్నారు?
`లారీలు వచ్చింది లేదు.. వడ్లు లోడ్ చేసింది లేదు?
80 శాతం వడ్లు ట్రాక్టర్ల ద్వారానే ట్రాన్స్పోర్ట్ జరుగుతాయి?
`లారీల ద్వారానే ట్రాన్పోర్ట్ అయినట్లు ‘‘ట్రక్ షీట్లు’’ కట్ చేస్తారు?
`దొంగలు దొంగలు కోట్లు పంచుకుంటారు?
`తెలంగాణా మొత్తం మీద ‘‘ట్రక్ షీట్ల’’ కుంభకోణం?
ఏటా ‘‘40వేలకోట్ల’’ కు పైగా ప్రభుత్వ సొమ్ము మాయం?
`ఇదంతా కంటికి కనిపించని అవినీతి బాగోతం?
`ఒక్క క్వింటాల్ కు 40 రూపాయలు రైతుకు ‘‘ట్రాన్స్పోట్’’ ఖర్చు ఇవ్వాలి?
`ఏ ఒక్క రైతుకు ‘‘ట్రాన్స్పోర్ట్’’ ఖర్చు ఇవ్వరు?
`’’ట్రాన్స్పోర్ట్ ట్రక్ షీట్లు’’ మాత్రం అధికారులు కట్ చేస్తారు?కాంట్రాక్టర్లకు చెల్లిస్తుంటారు?
`అధికారులు, కాంట్రాకర్లు పంచుకతింటున్నారు?
`ప్రభుత్వం స్పందించి ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయాలి?
`ఇంత కాలం దోచుకుతిన్నది కక్కించాలి?
……………………………
`హనుమకొండ జిల్లాలో ‘‘ట్రాన్స్పోర్ట్ ట్రక్ షీట్ల’’ యవ్వారం త్వరలో మీ ‘‘నేటిధాత్రి’’లో
`లారీల్లో ఉన్నది ఆ రోజు వడ్లే కాదు? ఆరోజు ఆ లారీలు హనుమకొండ జిల్లాలోనే లేవు?
`’’ట్రాన్స్పోర్ట్ ట్రక్ సీట్లు’’ మాత్రం ఆ లారీల నెంబర్లతో రెడీ చేసిన అవినీతి అధికారులు?
`’’నేటిధాత్రి’’ ఇన్వెస్టిగేషన్లో ‘‘ట్రాన్స్పోర్ట్ ట్రక్ సీట్ల’’ కుంభకోణంపై నమ్మలేని నిజాలు!
హైదరాబాద్, నేటిధాత్రి:
కంటికి కనిపించని అవినీతి కొండంత వుంటుందంటే మీరు నమ్మగలరా? అలాంటి అవినీతి సివిల్ సప్లై శాఖకే సాద్యమంటే నమ్ముతారా? అవును నమ్మాలి! అలాంటి లీలలు వుండేది ఒక్క సివిల్ సస్లయ్ శాఖలోనే వుంటాయి. ఎనుగంత అవినీతి వున్నా, ఎలుక కనిపించే అవినీతి అయినా రెండూ కొండను మించేంత అవినీతికి ఆలవాలమే! సివిల్ సప్లయ్‌లో జరిగే అవినీతి ఒక్క రకం కాదు. పలు రకాలు. అందులో ట్రాన్స్ పోర్టు ట్రక్ షీట్లు అంటే అందరం విస్తుపోవాల్సిందే. వినడానికి చాలా చిన్నగా కనిపిస్తుందతి. కాఇన మిగతా అవినీతి రకాలలో ఇదే అతి పెద్దది. దీనిని బైటకు కనిపించనంత గోప్యంగా జరుపుతుంటారు. సహజంగా సివిల్ సప్లయ్‌లో కొనుగోలు, అమ్మకాలు, మిల్లులు, వడ్లు కేటాయింపులు, బియ్యం తరలపింపులు అనేవి చెప్పుకుంటాం. కాని వాటన్నింటికీ తలదన్నే అవినీతి ట్రక్ షీట్ల కుంభకోణం. దీనిపై ఎవరూ దృష్టిపెట్టరు. కేవలం ఇది సివిల్ సప్లయ్ అధికారులకు మాత్రమే తెలిసిన అవినీతి. అందుకే ఎవరూ పట్టించుకోరు. ప్రభుత్వం దాకా ఈ అవినీతి విషయం చేరదు. పుటుక్కున పుట్టి, పుటుక్కున మాయమైపోయే లాంటి పెద్ద అనకొండ లాంటి అవినీతి. కాని కంటికి ఎక్కడా కనిపించదు. ఆ లెక్కలు ఎవరూ పట్టించుకోరు. ఆ ఫైల్స్ ఎక్కడా దాచి పెట్టరు. దానిపై ఎవరూ మానిటరింగ్ చేయరు. అసలు ఆ లెక్కలనే ఉన్నత స్దాయి అదికారులు పట్టించుకోరు. ఇందులో జరిగే బాగోతం పెద్దల దాక వెళ్లదు. అందుకే సివిల్ సప్లయ్‌శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు గుట్టుచప్పుడు కాకుండా కోట్లాది రూపాయలు గుటుక్కున మింగేస్తారు. లెక్కలు మాయం చేస్తారు. కనీసం కాగితం మీద కూడా లెక్కలు లేకుండా తుడిచేస్తారు. ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు తూట్లు పెడుతున్నారు. తతంగం చిన్నదిగా కనిపిస్తుంది. కాని దుర్మార్గం పెద్దది. అవినీతి వేల కోట్లులో వుంటుంది. సహజంగా రైతులు తమ వడ్లను కల్లాల నుంచి నేరుగా ఐకేపి సెంటర్లకు తరలిస్తుంటారు. అక్కడి నుంచి నేరుగా కాంట్రాక్టర్లు ఆ వడ్లను మిల్లులకు చేర్చుతుంటారు. అలా ఐకేపి సెంటర్లకు తెచ్చే రైతుల్లో ఎక్కువ శాతం నేరుగా ట్రాక్టర్లలో మిల్లులకు చేర వేస్తుంటారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వడ్లు లారీలలోనే మిల్లులకు తరలించాలి. లేకుంటే మార్కెట్ యార్డులకు తరలించాలి. అక్కడి నుంచి మిల్లులకు చేర్చాలి. ఇది ప్రాసెస్. అలా తలించిన వడ్లకు కూడా రైతులకు ప్రభుత్వం ట్రాన్స్‌పోర్టు ఖర్చు చెల్లిస్తుంది. ఈ విషయం రైతులకు కూడా తెలుసు. బస్తాకు రూ.40 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే మన పంట కాలాలో వచ్చిన మార్పుల మూలంగా పంట చేతికొచ్చే సమయానికి వానలు కురవడం పరిపాటిగా మారింది. గతంలో రైతులకు ఈ ఇబ్బంది వుండేది కాదు. ఎందుకంటే గతంలో తెలంగాణలో రెండు పంటలు పండడం గగనమైపోయేది. ఇప్పుడు రెండు, మూడు పంటలు కూడా పండిస్తున్నారు. దాంతో పంట చేతికొచ్చే సమయంలో కూడా అయితే వడగండ్లు లేకుంటే, తుఫానుల కారణంగా చేతికొచ్చిన పంట తడిసిపోయే పరిస్దితులు ఎక్కువౌతున్నాయి. అందుకే రైతులు పంటను నేరుగా మిల్లులకు తరలించే ఏర్పాట్లు స్వయంగా చేసుకుంటారు. కాని ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆ తరలింపులకు కూడా ఖర్చును ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇదే సివిల్ సప్లై అధికారులకు, కాంట్రాక్టర్లకు వరంగా మారింది. కోట్ల రూపాయల వర్షం కురిపిస్తోంది. రైతులకు మొండిచేయి మిగులుతోంది. దాన్యం తడిస్తే మొదటికే మోసం వస్తుందన్న ఆలోచనతో రైతులు తమ పంటను మార్కెట్‌కు, ఐకేసి సెంటర్లకంటే మిల్లులకు తరలించడం మేలనుకుంటారు. ఇదే సివిల్ సప్లై అధికారుకుల, కాంట్రాక్టర్లు కోట్లు జేబులో వేసుకునే వెసులుబాటు కలుగుతోంది. అలా ఐకేపి సెంటర్లు, మార్కెట్ యార్డుల నుంచి మిల్లులకు తరలించేందుకు అవసరమైన లారీలకు ట్రాన్స్‌పోర్టు ట్రక్ షీట్లు అధికారులు కట్ చేస్తుంటారు. మరీ విచిత్రమేమిటంటే మార్కెట్‌కు, ఐకేపి సెంటర్లకు వడ్లు రాకముందే కాంట్రాక్టర్లకు సివిల్ సప్లయ్ అధికారులు ముందే ట్రక్ షీట్లు ఇవ్వడం కూడా జరుగుతోంది. అలా వచ్చేసొమ్ము చిన్నా చితక కాదు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే సుమారు 40వేల రూపాయలౌతుంది. ఇదంతా నేరుగా ప్రభుత్వ ఖజానాకు కన్నం పెట్టడమే అవుతుంది. ఇలా జారీ చేసిన ట్రక్ షీట్ల సొమ్ము నుంచి అధికారులు సుమారు 25శాతానికి పైగా లంచాలు తీసుకుంటారు. నిజానికి ఆ వడ్లను రైతులే తమ సొంత ఖర్చులతో తరలిస్తుంటారు. కాని అదికారులు ఆ వడ్లను లారీల ద్వారా మిల్లులకు తరలించినట్లు లెక్కలు రాస్తారు. కాంట్రాక్టర్లకు ట్రక్ షీట్లు కట్ చేస్తారు. ఈ ట్రక్ షీట్లు రైతుల పేరుమీద కట్ చేయాలి. నేరుగా రైతులకు చెల్లించాలి. కాని తెలంగాణలో ఏ ఒక్క రైతు కూడా తమకు ట్రాన్స్‌పోర్టు ఖర్చు కాంట్రాక్టర్లు చెల్లించినట్లు చెప్పలేరు. వారికి రూపాయి కూడా అందదు. ఐకేసి సెంటర్ల నుంచి ఫలాన నెంబరు లారీతో వడ్లు తరలించినట్లు లెక్కలు రాసేస్తారు. బిల్లులు తయారు చేస్తారు. కాని అదంతా అవాస్తవం. అవన్నీ తప్పుడు లెక్కలే? ఏ సమయంలో వడ్లకు తరలింపుకు వినియోగించినట్లు రాస్తున్న లారీ ఆ సమయంలో ఎక్కడుందో అనేది ట్రాక్ చేస్తే అసలు బండారం అంతా బైట పడుతుంది. అదికారుల అవినీతి బాగోతం అంతా తేలుతుంది. లారీలు లేని, రాని వాటికి కూడా బిల్లులు తీసుకుంటూ ప్రభుత్వానికి కన్నం పెడుతున్న కాంట్రాక్టర్ల తిక్క కుదురుతుంది. ఇలా కొన్ని సంవత్సరాలుగా ఈ అవినీతి బాగోతం జరుగుతోంది. కాని దీని గురించి ఎవరూ పట్టించుకోరు. ఇలా కూడా కాంట్రాక్టర్లు, సివిల్ సప్లయ్ అధికారులు ప్రభుత్వ సొమ్ము లూటీ చేస్తున్నారని కూడా ఎవరూ ఊహించరు. ప్రబుత్వం మాత్రం ఇలా ట్రాన్స్‌పోర్టు చార్జీలను రైతులకు అందిస్తున్నామనే అనుకుంటుంది. అధికారుల పంపిన రిపోర్టులను నమ్మి నిధులు విడుదల చేస్తోంది. ఇంత జరుగుతున్నా ఏ ఉన్నతాధికారి దృష్టికి ఈ దోపడీ గురించి సమాచారం వెళ్లదు. అధికారులకుఅత్యంత సన్నిహితులైన కొంత మంది మిల్లర్లే కాంట్రాక్టర్ అవతారం ఎత్తుతారు? ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ మిల్లర్ కాంట్రాక్టర్‌గా వుండకూడదు. కాని శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయలన్నట్లు, మిల్లర్లు తమ బంధువులు, సన్నిహితుల పేరు మీద కాంట్రాక్టర్ అవతారం ఎత్తుతారు. ట్రాన్స్‌పోర్టు ఖర్చును మొత్తం మింగేస్తున్నారు. అదికారులకు కమీషన్లు ఇచ్చి, సొమ్మును దిగమింగుతున్నారు. పైకి ఏ మాత్రం కనిపించని ఈ అవినీతి అనేది ఏటా వేల కోట్ల రూపాయలు అనేది నేటిధాత్రి పరిశోధనలో తేలింది. నేటిధాత్రి లోతైన పరిశోధన సాగించింది. రైతుల నుంచి వివరాలు సేకరించింది. అయితే రైతులు క్వింటాలుకు కేవలం రూ.12 రూపాయలే కదా? అనుకుంటారు. వారికి కూడా ప్రభుత్వం రూ.40 ఇస్తుందన్న సంగతి ఏ ఒక్క రైతుకు తెలియదు. ఆ 12 రూపాయల కోసం పది పదిహేను రోజులు బ్యాంకుల చుట్టూ ఏం తిరుగుతామని నిర్లక్ష్యం చేస్తారు. అలా వచ్చే సొమ్ము కోసం కాళ్లరిగేలా తిరగడం ఎందుకు అనుకుంటారు. తెలంగాణలో సుమారు 64లక్షల మంది రైతులున్నారు. అలా రైతులందరూ ఒకేలా ఆలోచిస్తారు. అనుకుంటారు. ఇదే సివిల్ సప్లయ్‌శాఖ అవినీతి అధికారులకు, కాంట్రాక్టర్లకు కోట్లు కురిపిస్తోంది. ఒక వేళ ఎక్కడైనా రైతులకు ఇచ్చినా కేవలం రూ.8 నుంచి రూ.12 కంటే ఎక్కువ ఇవ్వరు అనేది కూడా నేటిధాత్రి పరిశోధనలో తేలింది. అటు రైతులను, ఇటు ప్రభుత్వాన్ని నిండా ముంచుతున్న ఈ ట్రక్ షీట్ల దందాపై ప్రభుత్వం దృష్టిపెడితే వేల కోట్ల రూపాయలు వృధా కావు. ఒక వేళ ఆ సొమ్ము రైతులకు చెందేలా చేసినా ఫరవాలేదు. కాని మధ్యలో దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు కోట్లు పంచుకుంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కంటికి కనిపించని, చేతికి లెక్క తెలియని, వేలాది కోట్లు అవితీని పరుల చేతుల్లోకి అప్పనంగా వెళ్లిపోతున్నాయి. ప్రభుత్వం వెంటనే దీనిపై దృష్టిపెట్టాలని రైతులు కోరుతున్నారు.