హెచ్ఎంఎస్ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ జే శ్రీనివాస్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
సింగరేణిలో డిపెండెంట్ల వయోపరిమితి వయసు 45 ఏళ్లకు పెంచడం హర్షనీయమని, వయోపరిమితి పెంపు ఏ ఒక్క యూనియన్ తో సాధ్యం కాలేదని, గతంలోనే అన్ని యూనియన్లు యాజమాన్యంతో ఒప్పందం చేసుకున్నాయని,అన్ని సంఘాలతోనే సాధ్యమైందని మందమర్రి ఏరియా హెచ్ఎంఎస్ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ జే శ్రీనివాస్ అన్నారు. బుధవారం రామకృష్ణాపూర్ సిహెచ్పి లో కార్మికులతో కరాచాలనం కార్యక్రమంలో జే శ్రీనివాస్ మాట్లాడుతూ…. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తూ, కార్మికుల శ్రేయస్సు కోరే సింగరేణి సీఎండీ బలరాం నాయక్ కు కార్మికుల వయోపరిమితి పెంపులో ప్రత్యేక ఘనత దక్కుతుందని అన్నారు. సిఎండి బలరాం నాయక్ కు సింగరేణి యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. సింగరేణిలో పేర్లు మార్పు, నూతన గనుల ఏర్పాటుకు అన్ని సంఘాలు ఏకమై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని హెచ్ఎంఎస్ పిలుపునిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్పి ఫిట్ సెక్రటరీ చొప్పరి రామస్వామి, సింగరేణి కార్మికులు పాల్గొన్నారు.