మాస్ లైన్ నేతలు ఈసం శంకర్, వాంకుడోత్ అజయ్
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
సిపిఐ( ఎంఎల్) మాస్ లైన్( ప్రజాపంథా) రాష్ట్ర నేతలు సివై పుల్లయ్య, ఆవుల అశోక్, హనుమంతరావు, జి అశోక్,గడ్డం లక్ష్మణ్, నూనావత్ శ్రీను తదితరులపై ఖమ్మం జిల్లా సీపీ సునీల్ దత్ అక్రమంగా బనాయించిన కేసులను ఎత్తివేయాలని మంగళవారం గుండాల మండల కేంద్రంలో విలేకరుల సమావేశం లో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మం నగరంలో పార్టీ జాతీయ మహాసభల సందర్భంగా వాల్ రైటింగ్ రాస్తున్న సందర్భంలో రెస్టారెంట్లో ఉన్న కొద్దిమంది అరాచక వాదులు మా పార్టీ నేతలపై దాడి చేశారు. ఖమ్మం సిపి సునీల్ దత్ మా పార్టీ నేతలపై దాడి చేసిన వారిని వదిలేసి దొంగే, దొంగ అన్న చందంగా మా పార్టీ నేతల పై కేసు పెట్టి జైలుకు పంపించడం విడ్డూరంగా ఉందన్నారు. నిరంతరం ప్రజా పోరాటాలు నిర్వహిస్తూ, ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కొరకు, పేద ప్రజల తరపున కొట్లాడే సిపిఐ ( ఎంఎల్) మాస్ లైన్( ప్రజాపంథా) పార్టీ నేతలపై రౌడీ షీటర్లు, నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులని సంభాషించడం తగదన్నారు . మా పార్టీ నేతలపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ (ఎంఎల్ )మాస్ లైన్ ప్రజా పందా నాయకులు తెల్లం రాజు, పూనెం లక్ష్మయ్య, సనప కిషెందర్, మోకాళ్ళ పాపారావు తదితరులు పాల్గొన్నారు.