
రోజువారి కూలీలు చిరు వ్యాపారులు టార్గెట్
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని గిరి గిరి వడ్డి వ్యాపారం మూడు పూలు ఆరు కాయల్లో జోరుగా సాగుతుంది 1000 రూపాయలు ఇస్తే వారం రోజుల్లో 200 కలిపి 1200 ఇవ్వాలి మధ్యతరగతి ప్రజలను దోపిడీ చేస్తున్నారు ఆదివాసి గ్రామాలే వారి టార్గెట్ మండలంలోని ప్రతి ఏట లక్షలు వడ్డీ వ్యాపారం జరుగుతుంది అని విమర్శలు వస్తున్నాయి సులభ వాయిదా పద్ధతిలో చెల్లించవచ్చు అంటూ ఆశ చూపుతో మండలంలో ఉన్న ఆదివాసి గ్రామాల్లో తిరుగుతూ డబ్బు ఆశ చూపి అధిక వడ్డీలకి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు మండలంలో కొందరు దీనిని వృత్తిగా చేసుకొని అప్పులు ఇస్తూ యధాచగా తమ దందాలను నిర్వహిస్తున్నారు తప్పనిసరి పరిస్థితిలో కొంతమంది రోజుకు పది రూపాయలు వడ్డీ కూడా చెల్లిస్తున్నారు రోజువారి కూలీలు చిరు వ్యాపారుల సైతం వదలను వడ్డీ వ్యాపారులు ఇప్పటికైనా ఉన్నత అధికారుల స్పందించి ఏజెన్సీ ప్రాంతంలో అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారం నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు