ముఖ్యంగా పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థుల కొరకు
జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం మానసిక ఒత్తిడి వల్లనే ఆరోగ్య సమస్యలు వస్తాయనీ దాని ప్రభావం శరీరంపై చూపిస్తుందని దానిని అరికట్టాలంటే మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలని మెడికల్ ఆఫీసర్ సింధూర అన్నారు. జైపూర్ మండలంలోని జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు మానసిక ఒత్తిడి వ్యాయామాల గురించి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదివేటప్పుడు ఇంటి సమీపంలో కానీ మానసిక ఒత్తిడి ఉంటే తన శరీరంపై ప్రభావం చూపించి కోపం బాధ లాంటి నెగటివ్ ఎమోషనల్ పెరిగి ప్రమాదాలకు దారితీస్తుందని తెలియజేశారు. గుండె, కిడ్నీ కి అనేక రకాలుగా జబ్బులు తీసుకొస్తాయని అన్నారు.శరీరంలో ఒత్తిడిని తగ్గించాలంటే మనసు ప్రశాంతంగా ఆనందంగా ఉంచుకోవాలని మంచి మనసుతో ఉంటే పాజిటివ్ ఆలోచనలు పెరుగుతాయని సాధారణ స్థాయికి శరీరాన్ని తీసుకొస్తాయని తెలియజేశారు.గుండె బిపి శ్వాస అన్ని సాధారణ స్థాయికి చేరుకొని ప్రశాంత వాతావరణం గడుపుతారని అన్నారు. వ్యాయామాలు చేయడం వల్ల అనేక రకాల వ్యాధులు రాకుండా సహాయపడతాయి. శరీర ఆరోగ్యానికి చికిత్సగా ఉపయోగపడుతుందని అన్నారు.క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే బరువు తగ్గడానికి బరువు పెరగకుండా సహాయపడుతుందని అన్నారు. వ్యాయామం చేయడం వల్ల గుండె జబ్బులు రక్తపోటు అనేక రకాల జబ్బులు రాకుండా ఉంటాయని తెలియజేశారు.