వనపర్తి నేటిదాత్రి :
జూన్ 9న జరిగే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ పరీక్షల పరిశీలక లను ఆదేశించారు.
గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ పై బుధవారం ఉదయం ఐ.డి. ఒ.సి లోని సమావేశ మందిరంలో పరిక్ష చీఫ్ సూపరింటెండెంట్, పరిశీలకుల కు ఇచ్చిన ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు నిబంధనల్లో సూచించిన ప్రతి పదాన్ని క్షుణ్ణంగా చదవాలని సూచించారు. ఏ ఒక్క చిన్న తప్పు జరగడానికి వీలు లేకుండా జాగ్రత్తగా నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు ఈసారి బయోమెట్రిక్ హాజరు తీసుకుంటున్నందున ఉదయం 9.30 నుండి అభ్యర్థులకు బయోమెట్రిక్ సజావుగా నిర్వహించాలని సూచించారు. సి.సి కెమెరాలు సరైన చోట పెట్టించడం, అవసరమైన మేరకు సిబ్బందిని నియమించుకోవడం, బెంచీలు, తాగు నీరు , మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు ఉండే విధంగా చూసుకోవాలని కోరారు.
రీజినల్ కో ఆర్డినేటర్ చంద్రశేఖర్ చీఫ్ సుపరిండెన్ట్ లకు ప్రొజెక్టర్ ద్వారా పరీక్షల నిర్వహణ, నియమ నిబంధనల పై అవగాహన కల్పించారు అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, రీజినల్ కో ఆర్డినేటర్ చంద్రశేఖర్, చీఫ్ సూపరింటెండెంట్ లు, అబ్జర్వర్ లు పాల్గొన్నారు.
9 న జరిగే గ్రూపు 1 ప్రిలి మిన రి పరిక్షను పకడ్బందీగా నిర్వహించా లి
