చందుర్తి, నేటిధాత్రి:
గాలి బీభత్సం కారణంగా నిరాశ్రయులైన కుటుంబానికి కాంగ్రెస్ నాయకులు చేయూత అందించారు. చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన కీర్తి సంధ్య వేంకటేష్ కాయ కష్టం చేసి అప్పులు చేసి ఇల్లు నిర్మాణం చేసుకోగా ఈదురు గాలుల కారణంగా గాలి బీభత్సానికి ఇంటిపై రేకులు పూర్తిగా తొలగిపోయింది. దీంతో నీడ లేకుండా పోయింది ఈ విషయం తెలుసుకున్న వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు గ్రామ కాంగ్రెస్ యువ నాయకుడు ఫోంచెట్టి వెంకటేష్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి వారి కుటుంబానికి నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే తో మాట్లాడి వారికి తగిన న్యాయం చేస్తాం అని ఓదార్చడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మల్లారపు రాజయ్య, ఈర్ల రవి, సంటి ప్రసాద్ ఈసారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు