ముదిరాజ్‌లను బీసీ – ఏలో చేర్చాలి
ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్
ప్రభుత్వానికి వినతిపత్రాల సమర్పణ కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరణ
ప్రభుత్వం ముందు పలు డిమాండ్‌లు
హన్మకొండ :ముదిరాజ్‌ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని, ముదిరాజ్‌లను బీసీ – ఏలో చేర్చాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమకొండ పట్టణం మచిలీబజార్ లో తెలంగాణ ముదిరాజ్ మహాసభ కమ్మూనిటీ హాల్ నందు ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి పులి రజినీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలను అందించే కార్యక్రమాన్ని సోమవారం నుంచి చేపట్టడంతో పాటు తెలంగాణ ముదిరాజ్ మహాసభ ప్రభుత్వం ముందు పలు డిమాండ్‌లను నెరవేర్చాలని రూపొందించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా పులి రజినీకాంత్ మాట్లాడుతూ… తెలంగాణలో అత్యంత ప్రాచీన, అధిక జనాభాగల కులమైన ముదిరాజ్/ తెనుగోళ్ళు/ముత్తరాసి అయిన తాము సమాజములో అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నామని అన్నారు. ముదిరాజుల అభివృద్ధి కోసం ముదిరాజ్ కోఆపరేటివ్ సోసైటీ లిమిటెడ్ ను ఏర్పాటుతో పాటు ప్రతి సంవత్సరానికి 1000 కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మత్స్య శాఖలోని సొసైటీలకు ఎన్నికలు జరపాలని, మత్స్యకారులకు ఆసరా పింఛన్ సౌకర్యం కల్పించాలని, ప్రత్యేక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని, ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని కొనసాగించాలని, ముదిరాజ్లకు మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని కోరారు. నామినేటెడ్ పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చొప్పరి సోమయ్య, ఎన్ఆర్ఐ రాజ్‌కుమార్, పిట్టల సత్యనారాయణ, రవి కుమార్, మహేందర్, బయ్య శోభన్, పులి మధు, కుమారస్వామి, సారంగపాణి, సాంబమూర్తి, విక్రమ్, బుచ్చిరాజు, సదానందం, హరికృష్ణ, ప్రకాశ్, సమ్మయ్య, సాంబయ్య, వెంకటస్వామి, రవీందర్, మహేష్, శ్రీకాంత్ పాల్గొన్నారు.