
President Dr. Banoth Sarangapani.
భవిష్యత్ బిఆర్ఎస్ దే..!
#ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల్లో బి ఆర్ఎస్ తడాఖా చూపెట్టాలి.
#మండల పార్టీ అధ్యక్షుడు డా: బానోత్ సారంగపాణి.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
బారాస వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేసి, ప్రయాణికులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే అన్ని విధాలుగా ప్రభుత్వం విఫలం చెందిందని. కావున రాబోయే ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు వివరించి ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు. గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పెట్టని అనేక సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరే విధంగా చేసిన కృషిని ప్రజలకు తెలియపరుస్తూ. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మండలానికి చేసిన అభివృద్ధిని చూపెడుతూ స్థానిక ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో అధికారం చేపట్టే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల వలె పని చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ ఛైర్మెన్ చెట్టుపల్లి మురళీధర్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్ గౌడ్, మాజీ సర్పంచ్ నాన బోయిన రాజారాం యాదవ్, నాయకులు గందె శ్రీనివాస్ గుప్తా, పాండవుల రాంబాబు, క్యాతం శ్రీనివాస్, వక్కల చంద్రమౌళి, లావుడియా తిరుపతి, సామల దేవేందర్, గుమ్మడి వేణు, జన్ను జయరాజ్, గోనెల నరహరి, చిట్యాల సీతారాం రెడ్డి, పోడేటి ప్రకాశం తదితరులు పాల్గొన్నారు.