ఆదివాసి వ్యక్తి పైన దాడి…

tribles

ఆదివాసి వ్యక్తి పైన ఫారెస్ట్ అధికారులు విచక్షణ రహితంగా దాడి..

వ్యక్తికి ప్రక్కటెముకలు విరిగిన వైనం.

దాడికి పాల్పడిన ఫారెస్ట్ అధికారులను విధులు నుంచి తొలగించాలి.

ఫారెస్ట్ అధికారుల పైన ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు వెంటనే నమోదు చేయాలి..

మానవ హక్కుల కమిషన్ Save ఫిర్యాదు చేస్తాం.

ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటి..

నూగూర్ వెంకటాపురం, (నేటి ధాత్రి ):-

అటవీ శాఖా అధికారులు ఆదివాసీల పైన వరస దాడులకు పాల్పడుతూ ఉన్నారని ఆదివాసీ నాయకులు కొర్స నర్సింహా మూర్తి,ఉయిక శంకర్, పూనెం సాయి ఆరోపించారు. ఆదివారం అటవీ శాఖా అధికారుల చేత దాడికి గురై గాయాల పాలైన ఏకన్న గూడెం గ్రామానికి చెందిన కోరం సమ్మయ్య ను పరామర్శించారు. సమ్మయ్య ను, కుటుంబ సభ్యులను పూర్తి వివరాలు అడికి తెలుసుకున్నామని ఆదివాసీ సంఘాల నాయకులు తెలిపారు. అడవికి వెళ్లిన ఆదివాసీ పైన అటవీ శాఖా అధికారులు మూడు ప్రక్కఎముకలు విరిగేలా అత్యంత పాశవికంగా దాడి చేయడం హేయమైన దుశ్చర్య అని మండిపడ్డారు. ఒకవేళ సమ్మయ్య తప్పు చేస్తే శిక్షించడానికి న్యాయ వ్యవస్థలు ఉన్నాయని, కొట్టడానికి అధికారులకు అధికారం ఎవరిచ్చారు అని ప్రశ్నించారు. చట్టాన్ని చేతిలోకి తీసుకునే అధికారం ఎవరిచ్చారు అని నిలదీశారు. తనని వదిలేయమని ఎంత ప్రాదేయ పడిన కనికరం చూపకుండా దాడి చేయడం అమానవీయ చర్య అన్నారు. బాధితుడి లుంగీ విప్పి తన మెడకు, మొఖానికి ముసుకు వేసి, చేతులు వెనక్కి కట్టేసి విచక్షణ రహితంగా దాడి చేసినట్టు బాధితుడు సమ్మయ్య చెప్పినట్టు తెలియజేసారు. ఆదివాసీలు శతా బ్దాలు గా అడవిని కాపాడితే అటవీ శాఖా ఉద్యోగులు కంచే చేను మేసినట్టు అడవిని అమ్ముకుంటున్నారు అని విమర్శించారు. ఈ అమానవీయ ఘటన పైన జాతీయ మానవ హక్కుల కమిషన్ ని, ఎస్సి ఎస్టీ కమిష్ ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు నాయకులు నర్సింహా మూర్తి, శంకర్, సాయి తెలిపారు. సమ్మయ్య కుటుంబం రోడ్డు పడిందని, నష్టపరిహారం గా 10 లక్షలు ఇవ్వాలని ప్రభత్వాన్ని డిమాండ్ చేశారు… కోరం సమ్మయ్య కు న్యాయం జరగక పోతే చర్ల రేంజ్ ఆఫీస్ ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు..జి ఎస్పీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం ప్రతాప్, ఏ ఎన్ ఎస్ మండల అధ్యక్షులు కుంజ మహేష్, వాసం నారాయణ తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!