
కాలం గడుస్తున్న ప్రభుత్వాలు మారినా పట్టించుకోని పాలకులు
న్యూడెమోక్రసీ నాయకులు ముసలి సతీష్
ప్రభుత్వాలు మారిన చర్ల మండలంకు మాత్రం అగ్నిమాపక కేంద్రం రావడం లేదు
అగ్ని ప్రమాదాలకు భయబ్రాంతులకు గురవుతున్న పురిగుడిశ ప్రజలు
ఇటీవల కాలంలోఎన్నో అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్న విద్యుత్ షాక్ సరక్యూట్ తో పంటలు కాలిపోయిన వైరం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
చర్ల మండల కేంద్రంలో గత చాలా సంత్సరాల నుండి పైరు స్టేషన్ ఏర్పాటు చెయ్యాలని కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని కలిసి అఖిలపక్షంగా ఏర్పడి కొట్లాడుతూనే ఉన్నాం ఐనా ఈ పాలకులకు దున్నపోతు మీద వర్షం కురిసినట్టే ఉంటుంది ఎటువంటి చలనం లేదని ఈ సందర్బంగా ముసలి సతీష్ మాట్లాడుతూ ఇంకా ఎన్ని ఇల్లు అగ్నికి ఆహుతి అయితే ఫైర్ స్టేషన్ చర్లకు వస్తుంది ఓ ఏలేటి పాలకులారా మీరెందుకు స్పందిస్తలేరు ప్రతి యాట ఊర్లకు ఊర్లు కాలిపోతున్నాయి ఇక్కడనుండి ఈ వలస ఆగవా చర్ల మండలంలో 75%శాతం రెక్కాడితేనే డొక్కాడే ప్రజలు ఉన్నారు చర్ల మండలంలో 28పంచాయతీలు 58గ్రామాలు 50వేల పైబడి ప్రజానీకం ఉంది అని అయన అన్నారు*ప్రతి సంవత్సరం మంటలకు గురై లక్షలాది రూపాయలు నష్టం జరిగి ప్రజలంతా నిజస్రాయలుగా మారిపోతున్నారు కనికరం లేని పాలకులు కనీసం ఫైర్ స్టేషన్ ఇచ్చే పరిస్థితులలో లేరు.
వేసవికాలం అయిపోయే లోపు ఇలాంటి సంఘటనలు ఇంకెన్ని చూడాలో?అని అయన ఆవేదన వెక్తం చేశారు
చర్ల మండలం లింగాపురం గ్రామంలో నిన్న రాత్రి సుమారు 8. గంటలకు 1.మేడభత్తిని చిన్న నరసింహరావు.. 2.చందు.వీరి ఇద్దరి ఇల్లులు షాక్ సర్కిట్ జరిగి మొత్తం కాలిపోయి సర్వం కోల్పోయారు దాతలుఎవరు ఉన్న ఈ కుటుంబాని సహాయం చెయ్యాలని కోరుతున్నాము..55 కిలోమీటర్ల దూరంలో ఉన్న భద్రాచలం అక్కడినుండి కుయ్యి కుయ్యి అని గంట రెండు గంటలకు భద్రాచలం నుండి ఫైర్ ఇంజన్ వచ్చే లోపు మా బ్రతుకులు మొత్తం కాలి బూడిదవుతున్నాయి సర్వం కోల్పోతున్నము తప్ప పాలకులలో ఎటువంటి మార్పు లేదు అగ్ని ప్రమాధం జరిగిన కుటుంబాలకు పక్క ఇల్లు కట్టించి ఇవ్వాలని వారి సామానులు పంట కాలిపోయినందుకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోని 5.లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆవేదన వెక్తం చేసింది
ఇప్పటికైనా మండలంలో ఉన్న నాయకులు ప్రభుత్వంతో మాట్లాడి చర్లలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని మరల ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంమీదనే ఆధారపడి ఉందని దాతలు ఎవరు ఉన్న ఈ కుటుంబాన్ని ఆడుకోవాలనీ మండలంలో ఉన్న ప్రతి వాసులను నాయకులను ప్రజలను వ్యాపార వర్గాలను అధికారులను మీడియా మిత్రులను కోరుతున్నాము.
ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంకు ఉంది అయినా నమ్మకం లెనట్టుగా వ్యవహరిస్తున్నారు. గతంలో అనేక గ్రామాల తో పాటు నిన్న రాత్రి సుమారు 8.గంటల సమయంలో లింగాపురంలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఇల్లంతా కాలిపోయి బూడిద అయ్యింది రాత్రింబవళ్లు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని పైసా పైసా కూడా పెట్టుకుని ఇల్లు కట్టుకుంటే ఎండాకాలం వస్తే అగ్నికి ఆహుతి అయిపోయి. కన్న కలల మొత్తం బూడిద పాలవుతుంటే ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలందరూ అయోమయ పరిస్థితిలో ఉన్నారు.ఇప్పటికే ఎండలు పెరిగిపోయి ఉన్నాయి ఏ ప్రమాదం ఎప్పుడు జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించి చర్ల మండలంలో ఒక ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం.గతంలో వామపక్షంగా ఏర్పడి ప్రజల అందరితో అనేక ఆందోళన చేసి ఈ పాలకులకు ఎన్నోసార్లు విన్నవించుకున్నాం అయినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికైనా పాలకులు ప్రభుత్వ అధికారులు ఆలోచన చేసి ఇప్పటికైనా చర్ల మండలంలో ఫైర్ స్టేషన్ నెలకొల్పాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ గా కోరుతున్నాం.ఈ కార్యక్రమంలో. సర్పంచ్ రాధా మేడ బత్తిని కమల ఎడెల్లి దేవి గుండ్ల రమేష్ జక్క చిన్నక్క మేడ బత్తిని చందు జై రాజు నరసింహ చంటి నాగేశ్వరరావు శ్రీలేఖ చిరంజీవి రాజు తదితరులు పాల్గొన్నారు