మరిపెడ నేటి ధాత్రి.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ని గాలివారిగూడెం పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు బదిలీలు సహజమని మరిపెడ సముదాయ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంత రావు అన్నారు.గాలివారిగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో సుదీర్ఘ కాలంగా పనిచేసి ఇటీవల బదిలీ పై వెళ్ళన ఉపాధ్యాయులు గుగులోతు వెంకన్న, లింగాల మహేష్ గౌడ్,ఫైజుద్దీన్,బాలు గార్లకు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంతరావు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి కోసం ఉపాధ్యాయులు అవిశ్రాంతంగా కృషి చేశారని,విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కోసం కృషి చేసిన ఉపాధ్యాయుల కృషి మరువలేనిది అని అన్నారు.ఈ కార్యక్రమంలో పిఆర్టీయూ మండల శాఖ అధ్యక్షులు కీసర రమేష్ రెడ్డి,గాలివారిగూడెం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్.వెంకన్న,బి.మురళీధర్,
వీరన్న,విద్యార్థినీ,విద్యార్దులు తదితరులు పాల్గొన్నారు.