కారేపల్లి నేటి ధాత్రి
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం లోని
ఆల్యితండా గ్రామం సమీపంలో గల పచ్చిపాల భద్రయ్య వ్యవసాయ భూమి ఆక్రమణకు గురైందని మనస్తాపంతో పురుగులమందు తాగిన రైతు పచ్చిపాల భద్రయ్యను ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ లో చేర్పించి చికిత్స పొందుతుండగ అతని ఆరోగ్య పరిస్థితి విషమంగ ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ నుండి ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లడం జరిగింది అక్కడ వైద్యులు పరిశీలించి గడ్డి మందు సేవించడం వల్ల వాంతులు విరోచనాలు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారిందని పచ్చిపాల భద్రయ్య ఆరోగ్య పరిస్థితి గురించి అక్కడ డాక్టర్లు రెండు రోజులు గడిస్తే గాని ఎమి చెప్పలేమని సేవించింది గడ్డి మందు కాబట్టి ప్రమాదం ఏ క్షణంలోనైనా ఇబ్బంది జరగొచ్చ అని వైద్యులు తెలిపారని అతని కుటుంబ సభ్యులు తెలిపారు పచ్చిపాల భద్రయ్యకు ఎలాంటి హాని జరిగినా దానికి పూర్తి బాధ్యత ఆర్టిఐ మాజీ కమిషనర్ గుగులోత్ శంకర్ అతని బార్య బానోత్ లక్ష్మి పచ్చిపాల శ్రీనువాస్ తండ్రి సోమయ్య శంకర్ పంపిన ట్రాక్టర్ డ్రైవర్లు అతని ముఖ్య అనుచరులు పూర్తి బాధ్యత వహించాలని ప్రభుత్వ రేవెన్యూ శాఖ పోలీసు అధికారులు వారిపైన చట్ట పరమైన చర్యలు తీసుకోని కబ్జా అయిన అతని భూమిని ఇప్పించి పచ్చిపాల భద్రయ్య కుటుంబానికి న్యాయం చేయాలని ఉసిరికాయలపల్లి గ్రామ ప్రజలు వారి ఆవేదన వ్యక్తం చేశారు.