
రోహిత్ రాజు ఐపిఎస్
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా), నేటిధాత్రి :
కొమరారం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తూ అనారోగ్య కారణాలతో గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో మరణించిన హెడ్ కానిస్టేబుల్ సైదేశ్వరరావు కుటుంబానికి సోమవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తన కార్యాలయంలో చెక్కు రూపంలో 60,000/-రూపాయల నగదును అందజేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో నిరంతరం విధులు నిర్వర్తించే అధికారులు మరియు సిబ్బంది తమ ఆరోగ్యాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.మరణించిన పోలీసుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.ప్రభుత్వం తరఫున మరణించిన పోలీసుల కుటుంబాలకు అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను త్వరితగతిన అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాసరావు,కార్యాలయ సూపరింటెండెంట్లు సత్యవతి,శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు.