జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను సందర్శించిన జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్. ఉపాధి హామీ పనులు జరుగుతున్న స్థలాన్ని సందర్శించినటువంటి కలెక్టర్ ఈ సందర్భంగా కూలీలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం సూచించినటువంటి సరైన కొలతల ప్రకారం గనుక పని చేసినట్లయితే రోజుకు 272 రూపాయల ఆదాయం రావడం జరుగుతుంది ఒకవేళ గ్రూపులోని వారు ఎవరైనా సరే సరిగా పనిచేయక సరైన కొలతలు పాటించక తక్కువ మొత్తంలో పని చేసినట్లయితే వచ్చే రూపాయల్లో ఆదాయం తగ్గుతుంది కనుక గ్రూపులో ప్రతి ఒక్కరు నిబంధనల ప్రకారం పని చేస్తూ సరైన ఆదాయాన్ని పొందాలని మిగతా వారికి నష్టం జరగకుండా చూడాలని తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయాన్ని పొందినటువంటి ఈ అవకాశాన్ని ప్రతి జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోని ఈ పనిని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి తెలియజేశారు. ఈ సందర్భంలో కూలీలు కలెక్టర్ కి ఇప్పటివరకు పని చేసినటువంటి కూలీ వేతనం తమ ఖాతాలలో ఇంతవరకు జమ కాలేదని చెప్పుకోవడం జరిగింది. స్పందించిన కలెక్టర్ అతి త్వరలో ఇప్పటివరకు చేసినటువంటి కూలీ వేతనాన్ని ఖాతాలో జమ అయ్యే విధంగా చూస్తానని అలాగే వేసవికాలం వడదెబ్బ తాకే అవకాశం ఉంది కనుక ఉదయాన్నే పని ముగించుకొని ఇంటికి చేరుకోవాలని సూచించారు. అలాగే నీటి వసతి గురించి వైద్య సదుపాయం గురించి సేదా తీర్చుకోవడానికి నీడ గురించి అడిగి తెలుసుకుని కొన్ని సూచనలు చేసి నిబంధనల ప్రకారం అందరూ కలిసికట్టుగా చక్కగా పని చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఏడిఓ, ఎంపీడీవో,ఏపీవో, టి ఏ, ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు.