ఇక్కడ ఓట్లు అడిగే హక్కు మాకు మాత్రమే ఉంది.
కేసీఆర్ హయాంలో గ్రామాల రూపురేఖలు మారిపోయి.
మా తండాలో మా రాజ్యం అంటూ ఎన్నో ఏళ్లుగా పోరాటం చేసినా, గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు.
తెలంగాణ రాష్ట్రంలో తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే.
ప్రతి పల్లెలో మహిళలు కోలాటాలు బతుకమ్మలతో భారీగా స్వాగతం పలికారు
మరిపెడ నేటిధాత్రి.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ లో ని మరిపెడ మండల కేంద్రంలో ని ఉమ్మడి తానంచర్ల గ్రామాలు తానంచర్ల గ్రామపంచాయతీ మూలమరి తండా,కోటియా తండా,వాల్య తండా,అజ్మీర తండా,డిఎస్ఆర్ జెండాలు తండ, గ్రామ పంచాయతీలు బురాహాన్ పురం, గుండెపూడి, గిరిపురం ఎలమంచిలి తండ, స్టేజీ తండా, అనేపురం గ్రామాలలో కాంగ్రెస్ కు ఓటు వేస్తే కరెంట్ పోయి, జీవితాలు ఆగం అవుతాయి,కాంగ్రెస్ జూటా మాటలు, తప్పుడు ప్రచారం చేస్తుంది, కాంగ్రెస్ బిజెపిల మోసపూరిత వాగ్దానాలు నమ్మొద్దు,కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టాక తండాల్లో ఇళ్ళు ఇప్పిస్తాము,మన కేసీఆర్, మన బీఆర్‌ఎస్‌ను గెలిపించాలి, లంబాడీలకు ఒక సీసా, పైసలు ఇస్తే ఓటు వేస్తారని కాంగ్రెస్ వాళ్ళు అవమానించారు, అగౌరవ పరిచిన అలాంటి వారికి ఓటుతో బుద్ది చెప్పాలి.రెండు ఏళ్ళు కరోనా వచ్చి ఆర్థిక ఇబ్బంది అయినా సీఎం సంక్షేమ పథకాలు ఆపలేదు, సౌభాగ్య లక్ష్మి పథకం కింద మహిళలకు 3000 రూపాయలు, ప్రతి పౌరుడికి 5 లక్షల ఉచిత బీమా, విడతల వారీగా 5000 వరకు పెన్షన్ పెంపు, 400కే గ్యాస్ సిలిండర్, రైతుబంధు పెంపు వంటి పథకాలను బీఆర్ ఎస్ ప్రభుత్వం అందించబోతుంది, కాంగ్రెస్ బిజెపి అధికార దాహంతో కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను గందరగోళం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. అలాంటి వారితో అప్రమత్తంగా ఉండాలి.ఓటు వేసే ముందు నిత్యం మన కండ్ల ముందు ఉన్న అభివృద్ధిని చూసి ఆలోచించి అభివృద్ధి సంక్షేమానికి పట్టం కట్టాలని, మంచి చేస్తున్న ప్రభుత్వాన్నే మళ్ళీ కొనసాగించేందుకు కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి.డ్రైనేజీలు, సిసి రోడ్ 100% పూర్తి చేసుకుంన్నాము, గ్రామాలలో మంచినీటి కష్టాలు తొలగించాము, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ద్వారా ఆడపిల్లల వివాహాలకు కేసీఆర్ తోడుగా నిలిచారు.ఎక్కడో ఉండే ఎమ్మెల్యే కాదు, నిత్యం ఇక్కడ ఉండే రెడ్యా నాయక్ మరోసారి గెలిపిస్తే మీకు సేవ చేస్తారు.కాంగ్రెస్, బీజేపీ కుట్రలు నమ్మొద్దు,మన ఊరు బలం బలగం ఏంటో 30వ తేది రోజు మనం చూపించాలి.బిఆర్ఎస్ అభ్యర్థి డిఎస్ రెడ్యా నాయక్ కారు గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలి,నియోజకవర్గ బిడ్డగా రెండు చేతులు జోడించి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నాను.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపుడి నవీన్ రావు,ఎంపీపీ అరుణ రాంబాబు,జెడ్పిటిసి శారదా రవీందర్,మండల పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి,మాజీ ఒడిసిఎంఎస్ చైర్మన్ మహేందర్ రెడ్డి,కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చాపల యాదగిరి రెడ్డి,మాజీ సర్పంచ్ రామ్ లాల్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు,స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.