ఆదర్శమూర్తి చిట్టూరి హైమావతి మృతి బాధాకరం.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు ఎర్నేని బాబు
కోదాడ, నేటి ధాత్రి :
ఆదర్శమూర్తి చిట్టూరి హైమావతి మృతి బాధాకరమని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటరత్నం బాబు సిపిఐ సీనియర్ నాయకులు వార్డు కౌన్సిలర్ బతినేని హనుమంతరావు అన్నారు సోమవారం ఆమె భౌతిక కాయం వద్ద పూలమాల ఘటించి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతు తోడ్పాటు అందిస్తూ ఎంతోమందికి ఆదర్శమూర్తిగా నిలిచారని అన్నారు అందరిని ఆప్యాయతగా పలకరిస్తూ ప్రజా సేవలో ముందుండి పలువురికి ధైర్యాన్ని నింపుతూ అండగా నిలిచారని ఆమె సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు బొల్లు ప్రసాదు బిజెపి సీనియర్ నాయకులు కనగాల వెంకటరామయ్య కనగాల నారాయణ చిట్టిబాబు లైటింగ్ ప్రసాద్ చిట్టూరి శ్రీనివాసరావు రావెళ్ల కృష్ణారావు నాగేశ్వరరావు బంధువులు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు
