NIMZ Project Finally Gains Momentum
నిమ్జ్ నిరీక్షణకు తొలగిన తెర….!
◆”-: రూ:10628 కోట్ల పెట్టుబడులతో మౌలిక వసతులు
◆”-: పలు కంపెనీలకు 1186 ఎకరాల భూముల కేటాయింపు
◆”-: తొలి దశలో..”కంపెనీల ఏర్పాటుకు త్వరలో శంకుస్థాపనలు”..!
◆”-: కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్లు, నిర్మలా జగ్గారెడ్డిల చొరవతో చురుగ్గా పనులు పరిశ్రమల ఏర్పాటుతో వేలాది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఊపొందుకోనున్న రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం
◆-: నిమ్జ్ ప్రాజెక్టు ఏర్పాట్లపై “(నేటి ధాత్రి)” ప్రత్యేక కథనం
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాల్ కల్, పలు పరిశ్రమల ఏర్పాటు కోసం 201355.. 51 . 49 మేర కేంద్ర పెట్టుబడులతో ఏర్పాటు చేసిన “జాతీయ పెట్టు బడులు ఉత్పాదకమండలి” (నిమ్జ్) ప్రాజెక్టు ఏర్పాటుకు 14 సంవత్సరాల అనంతరం ఎట్టకేలకు తెరపడింది. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, అదనపు కలెక్టర్ల చొరవతో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి పనులు చక చక కొనసాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర
ప్రభుత్వాలు, ప్రభుత్వ యంత్రాంగం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిమ్జ్ ప్రాజెక్టు పనుల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన ఏర్పాటుకు శరవేగంగా చర్యలు చేపట్టింది. సంగారెడ్డి జిల్లా, న్యాల్ కల్, ఝరాసంఘం మండలా ల్లోని 17 గ్రామాల్లో.. దాదాపు 12600 ఎకరాల్లో పలు పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు భూ సేకరణ చేపట్టింది.ఈ నెల మార్చ్ 2న జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధ్యక్షతన టిఎస్ఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు మాధురి, విశాలాక్షి, జహీరాబాద్ ఆర్థిఓ దేవుజా, జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు, పరిశ్రమల యాజమాన్యంతో..”పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన” తదితర అంశాలపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. తొలి దశలో సేకరించిన నిమ్జ్ భూముల్లో సర్వే చేపట్టి, హద్దు రాళ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో పనులను ఆపే ప్రసక్తే లేదని, పనులను శరవేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
శరవేగంగా మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం..

ఈ పాటికే పలు పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించిన భూముల్లో మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం ముమ్మురంగా పనులను చేపట్టింది. తొలి విడతగా న్యాల్ కల్, ఝరాసంఘం మండలాల్లో 3500లను గుర్తించిన భూముల్లో 3245 ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు మార్చ్ తొలి వారంలో కసరత్తు చేపట్టారు. జిల్లా అదనపు కలెక్టర్లు, ఆర్డీవో, డీఎస్పీ, తహసిల్దార్లు, సీఐ, పోలీస్ బృందం రక్షణలో స్థానిక భూ నిర్వాసితులతో చర్చించి ఈ పాటికే సేకరించిన భూముల్లో సర్వే చేపట్టి హద్దు రాళ్లను ఏర్పాటు చేశారు. విద్యుత్తు, సీసీ రోడ్లు, నీటి సౌకర్యం, కార్మికుల కోసం షెడ్ల ఏర్పాట్లు, తదితర పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి.
1186 ఎకరాల్లో.. రూ:10628 కోట్లతో పరిశ్రమల ఏర్పాటు..

తొలిదశ పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారంలో భాగంగా అధికార యం త్రాంగం పలు పరిశ్రమల ఏర్పాటుకు 1186 ఎకరాలను కేటాయిం చింది. కేటాయించిన భూముల్లో “హ్యుందాయ్” (కార్ల పరిశ్రమ) కంపెనీ ఏర్పాటు కోసం కంపెనీ యాజమాన్యం ఇటీవలే కేటాయించిన భూము లను పరిశీలించింది. 511ఎకరాల్లో రూ:1000 కోట్లతో ఈవీఎం టెక్నాలజీ సంస్థ ఈ పాటికే ఒప్పందం కుదుర్చుకుంది. తాజాగా 675 ఎకరాల్లో రూ.8528 కోట్లతో కార్ల తయారీ కర్మాగారం ఏర్పాటు కోసం త్వరలోనే శంకుస్థాపన చేయనుంది. రూ:2100 కోట్లతో ఎలక్ట్రానిక్ కార్ల తయారీకి ఈ వాటికే ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలోనే ప్రాజెక్టుల ఏర్పాటుకు శంకుస్థాపనలు చేసి పూర్తిచేరినట్లు తెలుస్తోంది.
హద్దురాళ్లను తొలగిస్తే చర్యలు, పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం..
పరిశ్రమల ఏర్పాటు కోసం కేటాయించిన భూముల్లో జిల్లా యంత్రాంగం సర్వే చేపట్టి హద్దురాళ్లను ఏర్పాటు చేసింది. మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం ఏర్పాటు చేసిన హద్దురాళ్లను తొలగిస్తే అట్టి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ అధికార బృందానికి ఆదేశించారు. నిమ్స్ ఆధీనంలోని భూముల్లో రైతులు సాగుచేసిన పంట లకు నష్టం కలిగించకూడదని, తప్పనిసరిగా పంటలకు నష్టం వాటిల్లితే సంబంధిత భూ.నిర్వాసితులకు నష్టపరిహారం అందించాలని కలెక్టర్ స్థానిక అధికార బృందానికి ఆదేశించినట్లు సమాచారం.
