మూగజీవాల రోదన.. పట్టింపు ఎవరిది..
శిథిలావస్థలో రామాయంపేట పశు వైద్యశాల..
… బిక్కుబిక్కుమంటు కార్యాలయంలో కూర్చుంటున్న డాక్టర్లు..
రామాయంపేట ఏప్రిల్ 29 నేటి ధాత్రి(మెదక్)
మనుషులకు సమస్య వస్తే చెప్పుకోవడానికి మాటల ద్వారా చెప్పొచ్చు. కానీ మూగజీవాల రోదన ఎవరికి పట్టింపు అనే చందంగా మారింది రామాయంపేట పశు వైద్యశాల. ఉమ్మడి రామయంపేట మండలంలో ఎన్నో ఏళ్లుగా పశు వైద్యశాల ఉన్నది. చుట్టుపక్కల గ్రామాల గ్రామాల పశువులతో పాటు, గొర్రెల కాపరులు పశువులకు ఏవైనా వ్యాధులు సోకితే రామయంపేటకు వచ్చి వైద్యం చేయించుకొని వెళ్లేవారు. పశువైద్య డాక్టర్లు సైతం గ్రామాల్లో గాలికుంట, నట్టల నివారణ టీకాలు గ్రామాలకు వెళ్లి అందించేవారు. కానీ నేడు పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ఒకవైపు శిథిలావస్థకు చేరి చెత్తాచెదారం నిండిపోయి రెండు మూడు గదులు నిరుపయోగంగా ఉంచారు.

ఉన్న ఒక గదిలో పైసలు కందించి టీకాలతో పాటు మందులు ఉంచి పక్కనే ఒక కుర్చీ వేసుకొని కూర్చునే పరిస్థితి నెలకొంది. ఈ మధ్యకాలంలో కనీసం పశు వైద్యశాల ఉందనే విషయాన్ని సైతం మర్చిపోయే విధంగా తయారయింది. పశు వైద్య చికిత్సల కోసం వచ్చినవారు గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఏ ఏ మందులు అందుబాటులో ఉన్నాయో లేవు అర్థం కాని పరిస్థితి దాపురించింది. ఇదిలా ఉండగా గతంలో గ్రామ గ్రామాన పశు వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి వ్యాధుల బారిన పడ్డ గొర్రెలు, మేకలు, పశువులకు వైద్యం చేసేవారు. కానీ ఇప్పుడు అలాంటి శిబిరాలు ఎక్కడ కూడా జరగడం లేదు. పశు జాతి తో పాటు గొర్రెలు మేకలు పెంపుడు కుక్కలు కనుమరుగవుతున్న తరుణంలో ఉన్న వాటిని ఏ వ్యాధులు సోఖకుండా కాపాడుకోవడానికి రైతులు తమ వంతు కృషి చేస్తున్న ఫలితం లేకుండా పోతుంది.

పశువైద్యాధికారులు అందుబాటులో ఉండి వ్యాధులకు అవసరం ఉన్న మందులు సిద్ధంగా ఉంచితేనే ఏ వ్యాధులు వచ్చిన వాటిని నివారించుకొని వాటిని కాపాడుకోవడానికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు ప్రజలు కోరుతున్నారు. అలాగే వన్యప్రాణులు గాయపడ్డ, అస్వస్థతకు గురి అయిన సమయానికి వైద్యం అందడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇటీవల తోనిగండ్ల గ్రామ శివారులో కృష్ణ జింకను ఊర కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలుపగా వెటర్నరీ డాక్టర్ను తీసుకొని ఘటన స్థలానికి చేరుకునేలాగా ఆ కృష్ణ జింక్ అభివృద్ధి చెందింది. ఇదొకటే కాకుండా వన్య ప్లాన్లు గాయపడ్డ అశ్వసగురైన సకాలంలో చికిత్సలు అందిస్తే బాగుంటుందని ప్రజలు అంటున్నారు.

అందుబాటులో ఉంటున్నాం.. కానీ భయం గుప్పెట్లో వెటర్ని ఏడి తిరుపతి..
మేము ఎల్లప్పుడూ ఆసుపత్రిలో అందుబాటులో ఉంటున్నాం. కానీ భవనం శిథిలావస్థకు చేరడంతో పక్కనే ఉన్న గోడౌన్ లో విధులు నిర్వహించడం జరుగుతుంది. శిథిలవస్తులు ఉన్న భవనం గురించి పై అధికారులకు తెలపడం జరిగింది. అలాగే పశువులతో పాటు అస్వస్థతలకు గురైన వన్యప్రాణులకు సరైన సమయంలో వైద్యం అందించడం జరుగుతుంది.