సన్నబియ్యం ఇచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే.
మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా.
దుగ్గొండి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చుక్క రమేష్ గౌడ్
నర్సంపేట,నేటిధాత్రి:
నిరుపేదలు,సామాన్య ప్రజలు,ధనికుల ఓకె రకమైన సన్నబియ్యం తినాలనే ఉద్దేశ్యంతో దేశంలో మొదటిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో సన్నబియ్యం పథకం ప్రారంభించారని దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చుక్క రమేష్ గౌడ్ అన్నారు.ఇటీవలే నూతనంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు.ఈ సందర్బంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు ఆర్డినెన్సు చేసి దేశంలో చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందపరించిన విధంగా అన్ని పథకాలు అమలు చేస్తున్నదని వాటి అమలును ప్రజల్లోకి మండల పార్టీ సహకారంతో తీసుకెళ్తానని పేర్కొన్నారు. తనకు గత 30 ఏండ్లుగా రాజకీయ అనుభవం ఉన్న నేపథ్యంలో దుగ్గొండి మండలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిపించుకుంటానని రమేష్ గౌడ్ హామీ ఇచ్చారు.తమపై నమ్మకంతో మండల అధ్యక్షునిగా బాధ్యత ఇచ్చిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి,సహకరించిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి,నియోజకవర్గ నాయకులు,మండల నాయకులు,కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.