బుర్ర కొమురయ్య గౌడ్ చల్లూరు మధు
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు బుర్ర కొమురయ్య గౌడ్ చల్లూరు మధు ఇస్లావత్ దేవ్ ఆధ్వర్యంలో పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అసత్య ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు నాయకులపై చేస్తున్నారు తప్పుడు కేసులు పెడుతున్నారు అని ఆరోపణలు చేస్తున్నారు బిఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ మాజీ ఎమ్మెల్యే పై కేసు స్థానిక పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది ఆయనకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు మీ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ మీపై కేసు పెడితే కాంగ్రెస్ పార్టీ నాయకులు కక్ష సాధింపు రాజకీయాల చేస్తున్నారని అనడం విడ్డూరంగా ఉంది నాగవెల్లి రాజలింగమూర్తి కాంగ్రెస్ పార్టీలో చేరలేదు ఆయనకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు చట్టం తప్పు చేసిన వారిని ఎవరిని క్షమించదు చట్టం తన పని తాను చేసుకుంటే పోతుంది మీరు తప్పే చేయనట్టయితే మీకు అంత భయం ఎందుకు అని మాజీ ఎమ్మెల్యేను హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బుర్ర కొమురయ్య గౌడ్ కాంగ్రెస్ పార్టీ అర్బన్ అధ్యక్షులు విస్లావత్ దేవ్ ఎన్ ఎస్ సి ఐ అధ్యక్షులు కర్ణాకర్ సుభాష్ చల్లూరు మధు వెంకీ యాదవ్ రంజిత్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు