కేంద్ర ప్రభుత్వము మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి.

కేంద్ర ప్రభుత్వము మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి

శాంతి చర్చలు జరిపేం దుకు చొరవ తీసుకోండి

ప్రజా సంఘాల డిమాండ్

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

కేంద్ర ప్రభుత్వము మావోయి స్టులతో శాంతి చర్చలు జరప డానికి ముందుకు రావాలని ప్రజాసంఘాల నాయకులు
వంగర సాంబయ్య. చింతల భాస్కర్. అంకేశ్వరపు ఐలయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రజా సంఘాల నాయ కులు మాట్లాడుతూనక్సలైట్ల సమస్యను శాంతి భద్రత సమ స్యగా చూడకుండా ప్రభుత్వం వెంటనే మావోయిస్టులతో చర్చలు జరపాలని ప్రభు త్వాన్ని కోరారుమావోయిస్టుల పేరుతో ఈ దేశము ఆదివా సీలను అడవి నుండి బయ టకు పంపే ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నారని మండి పడ్డారు.గత ప్రభుత్వాలు ఆది వాసీల సంక్షేమం కోసం ఎన్నో రకాలైన అడవి హక్కుల చట్టా లను తెచ్చినప్పటికీ వాటిని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కి ఆదివాసులపై యుద్ధాన్ని ప్రకటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మావో యిస్టులో జాడ లేకుండా చేస్తా నని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రతిజ్ఞ చేశారు. కేంద్ర ప్రభుత్వం పేదలను కొట్టి సంపన్నులకు ఊడేగం చేసే విధానాలను ప్రోత్సహిస్తుందని వారన్నారు.రాజ్యాంగ హక్కు లను పేద ప్రజలకు పూర్తిగా అందించిన ప్పుడు సామాజిక అసమా నతలు లేకుండా ప్రభు త్వాలు రాజ్యాంగ ఫలాలను ప్రజల చెంతకు చేర్చినప్పుడు మావోయిస్టు సమస్య ఉండ దని అన్నారు.ప్రభుత్వాలు పేద ప్రజలకు చెందాల్సిన ఎన్నో రకాలైన సంక్షేమ కార్యక్రమా లను అమలు జరపకుండా వారిని ఆకలితో మాడే విధంగా చేస్తున్నంతకాలము ప్రజల మనసులలో ప్రభుత్వాల పట్ల పూర్తిస్థాయి వ్యతిరేకత వ్యక్తం అవుతుందని వారు తెలిపారు
మావోయిస్టులను అణిచివే యాలని పేరుతో ప్రభుత్వం కోట్లాది రూపాయలు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు
కేంద్ర ప్రభుత్వం గానీ,రాష్ట్ర ప్రభుత్వాలుగానీ ప్రజా సంక్షే మమే పరమపదిగా పనిచేసి నప్పుడు ప్రజల్లో సామాజిక అసమానతలు అంతరించి పోతాయని అప్పుడు సమా జంలో అందరూ సమానమైన భావన గుర్తిస్తారని, ప్రభుత్వా లు ప్రజా సంక్షేమానికి ఉప యోగపడే కార్యక్రమాలను నిర్వహించకుండా ప్రభుత్వాల తప్పులను ప్రశ్నించకుండా చేయడంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ప్రజలను భయభ్రాం తులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.ప్రభుత్వము మావోయిస్టులు సౌమ్య మానాన్ని పాటించి కాల్పుల విరమణను పూనుకోవాలని అన్నారు ఆదివాసీలు నివసి స్తున్న ప్రాంతాలలో పోలీసులు వికృతి చర్యలకు పాల్పడుతు న్నారని అటవీ భూములను అక్కడి ఖనిజ సంపదను సంపన్నులకు దోచి పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మావోయిస్టు సమస్యను సామాజికపరమైన సమస్యగా గుర్తించి అసమానతలు తగ్గించి ప్రజలంతా ఒక్కటి అనే భావనను తీసుకు వచ్చిన ప్పుడు ఆ సమస్యకు నిజమైన పరిష్కారం చూపి నట్టు అవుతుందని ప్రభుత్వము మావోయిస్టులు శాంతి చర్చలు జరపాలని కోరారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version