7-Year-Old Child Recovers at Rajarajeshwara Hospital
శ్రీరాజరాజేశ్వర పిల్లల ఆసుపత్రి వైద్యుల సేవలతో కోలుకున్నా బాలుడు..
రామాయంపేట, అక్టోబర్ 15 నేటి ధాత్రి (మెదక్)
రామాయంపేట పట్టణంలోని శ్రీరాజరాజేశ్వర పిల్లల ఆసుపత్రి,కంటి ఆసుపత్రి వైద్యులు మరోసారి తమ వైద్య నైపుణ్యాన్ని చాటుకున్నారు.జ్వరంతో బాధపడుతూ,ప్రమాదకరంగా ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిన గజ్వేల్ మండలం లింగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన రిత్విక్ నందన్ 7 సంవత్సరాల బాలుడిని విజయవంతంగా చికిత్స చేసి ఆరోగ్యవంతుడిగా మార్చారు. తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరిన బాలుడి పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉండగా, పీడియాట్రిషియన్ డాక్టర్ ప్రదీప్ రావు పర్యవేక్షణలో వైద్య బృందం ప్రత్యేక చికిత్సా విధానాలతో సేవలు అందించారు.వైద్యుల కృషి ఫలితంగా బాలుడి ప్లేట్లెట్స్ కౌంట్ సాధారణ స్థాయికి చేరుకుంది.ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడటంతో శుక్రవారం బాలుడిని డిశ్చార్జి చేశారు.ఈ సందర్భంగా బాలుడి తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కుమారుడికి ఉత్తమ వైద్యం అందించి ప్రాణం కాపాడిన డాక్టర్ ప్రదీప్ రావు మరియు ఆసుపత్రి సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.పట్టణ ప్రజలు మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో శ్రీరాజరాజేశ్వర ఆసుపత్రి అందిస్తున్న వైద్య సేవలు ఇటువంటి నిబద్ధత కలిగిన వైద్యులు రామాయంపేటకు గర్వకారణమని ప్రశంసించారు.
