
O. Venkataramana
అభ్యుదయ కవితా పతాక శ్రీ శ్రీ
తిరుపతి(నేటి ధాత్రి) ఏప్రిల్ 30:
సమాజంలోని అసమానతలపై తన రచనలతో అభ్యుదయాన్ని ఆకాంక్షిస్తూ, శ్రామిక జీవన సౌందర్యాన్ని ఎలుగెత్తి చాటిన కవి శ్రీరంగం శ్రీనివాసరావు అని కొనియాడారు.
బుధవారం తిరుపతి నగరంలోని వేమన విజ్ఞాన కేంద్రం మరియు అభ్యుదయ రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ శ్రీ జయంతి నిర్వహించారు.
ఈ సందర్భంగా
తిరుపతిబాలోత్సవం అధ్యక్షులు
నడ్డి నారాయణ అధ్యక్షతన
శ్రీ శ్రీ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన రచనలను చదివి వినిపించారు.ఈ కార్యక్రమంలో వేమన విజ్ఞాన కేంద్రం ప్రధానకార్యదర్శి మల్లారపు నాగార్జున, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు యువశ్రీ మురళి, డాక్టర్ నెమిలేటి కిట్టన్న,తిరుపతి జిల్లా రచయితల సంఘం కార్యదర్శులు మన్నవ గంగాధర ప్రసాద్,పేరూరు బాలసుబ్రమణ్యం
సాహితీ స్రవంతి జిల్లా కన్వీనర్ ఓ.వెంకటరమణ,
తదితరులు పాల్గొన్నారు.