వెనుకబడిన తరగతుల సంక్షేమఅధికారి ని సస్పెండ్ చేయాలలి

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం .డిమాండ్
వనపర్తి నేటిధాత్రి:
నాగర్ కర్నూలు జిల్లా కొండనాగులలో2016లో వెనుకబడిన తరగతుల హాస్టల్ లో వార్డెన్.గా ఉన్నప్పుడు హాస్టల్ విద్యార్థులకు అన్యాయం చేశారని అప్పట్లో ఏ సి బి అధికారులు కేసు నమోదు చేశారని ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంగం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు
అధ్యక్షులు పవన్ కుమార్ మాట్లాడుతూ విలేకరులతో మాట్లాడుతూ అన్నారు హాస్టల్ వార్డెన్ గా సుబ్బారెడ్డి కొండనాగుల లో ఉన్నపుడు 2016 సంవత్సరంలో ఉద్యోగంలో ఉన్నప్పుడు అక్కడ ఈ ఏ సి బి కేసు పెండింగ్ లో ఉండగా ఆయన ఉన్నత అధికారులను మభ్యపెట్టి ఈ అవినీతి అధికారి వనపర్తి జిల్లాకు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి గా బదిలీ ద్వారా నియామకమై ఇంచార్జి గా వనపర్తి జిల్లాలో 15 హాస్టళ్లకు మరియు ట్రైబల్ వెల్ఫేర్ ఇంచార్జ్ జిల్లా అధికారిగా 5 ఎస్టి హాస్టల్స్ కి ఉన్నారని ఈ అవీనీతి అధికారి విద్యార్థులకు న్యాయం చేస్తారా అని విమర్శించారు.
జరిగింది. బీరం సుబ్బారెడ్డి గారు కొండనాగుల హాస్టల్ నాగర్ కర్నూల్ జిల్లా నందు హాస్టల్ విద్యార్థులకు అన్యాయం చేసిన విషయాలు ఏమిటంటే విద్యార్థులకు రావాల్సిన కాస్మోటిక్ బిల్లులు, నోట్ బుక్స్, యూనిఫామ్స్, ఫుడ్ ప్రొవియన్స్ కిరాణంలాంటివి ఇవ్వకుండా మోసం చేసి అధికారులకు దొరికిపోయాడు. ఈయనపై ఉన్న మరో ఆరోపణ సంక్షేమ కమిషనర్ తెలంగాణ హైదరాబాద్ ఫిర్యాదు
ప్రకారంగా సుబ్బారెడ్డి తో పాటు నలుగురికి విచారణ మెమోలు ఇచ్చారని.అన్నారు . ఈ సుబ్బారెడ్డి ఎంతమందిని ఔట్ సోర్సింగ్ ఉద్యోగం లో నియమించినారు ఔట్ .సోర్సింగ్ ఉద్యోగుల కోసం ఏమైనా పేపర్ నోటిఫికేషన్ ఇచ్చినారా ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి ఏ ప్రాతిపదికన ఔట్సోర్సింగ్ ఎంప్లాయిమెంట్ సెలెక్ట్ చేశారు. ఔట్సోర్సింగ్ వారి నుండి లంచం తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి . దీనిపై పూర్తిస్థాయి విచారణ చేయాలని ప్రభుత్వంన్ని
డిమాండ్ చేశారు పూర్తిస్థాయి విచారణ చేసి తక్షణమే సుబ్బారెడ్డి గారిని ప్రభుత్వానికి సరెండర్ చేసి చర్యలు తీసుకోవాలని మా విద్యార్థి సంఘం తరపున డిమాండ్ చేశారు వర్కర్లను వెంటనే హాస్టళ్లకు పంపించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాం.
ప్రభుత్వం తరపున ఒక వాహనం ఏర్పాటు చేయడం జరిగింది.ఎందుకంటే బీసీ హాస్టల్స్ మానిటరింగ్ చేయడానికి , విద్యార్థినీ విద్యార్థులకు బాగోగులు చూడడానికి ప్రభుత్వ వాహనం కేటాయిస్తే జిల్లా అధికారి తన సొంత పనుల కోసం వాహనం ఉపయోగించుకుంటూ, పనిచేసే వర్కర్లను డ్రైవర్లుగా పెట్టుకుంటూ ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నందుకు అతని పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు తయానా, ప్రవీణ్, రాజు,గణేష్, రాజశేఖర్, రాఘవేందర్ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!