
రేగొండ,నేటి ధాత్రి
మండలంలోని తిరుమలగిరి గ్రామ శివారులోని సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతర బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యింది.నాలుగు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో మొదటి రోజులో భాగంగా కోయ పూజారులు ఆనవాయితీగా డప్పు చప్పుల్లతో సారలమ్మ తల్లిని గడ్డెలపైకి ప్రతిష్టించారు.కోయ పూజారి సూరటి రాజు నిస్ట తో సారలమ్మను పూని జాజి గుట్టలో కుంకుమ భరిని రూపంలో కొలువైవున్న ఉన్న సారలమ్మను గద్దేలపైకి ప్రతిష్టించారు.గురువారం సమ్మక్క రానుండగా కార్యక్రమం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుందని జాతర చైర్మన్ పర్శ శ్రీను తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు నిమ్మల విజేందర్,కాంగ్రెస్స్ జిల్లా నాయకులు రమణ రెడ్డి,జాతర కమిటీ సభ్యులు పర్ష సురేషు,సదయ్య,రాజయ్య, మొగిలి, ఈర్ల అనీలు ఈర్ల సారయ్య వీర్ల రాజయ్య,తీగల సారంగం, వడ్లూరి రవీంద్ర చారి,పర్ష రాములు, పర్ష శంకర్,పిట్టల రవి తదితరులు పాల్గొన్నారు.