కూటమి ప్రయోగం మొదటికే మోసం!

https://epaper.netidhatri.com/view/318/netidhathri-e-paper-13th-july-2024%09

-కూటమి ఏపికే పరిమితం!

-తెలంగాణలో కమల వికాసానికి కూటమి అడ్డంకి!

-ఇప్పుడే బిజేపి తెలంగాణలో బలంగా వుంది.

-చేజేతులా మళ్లీ చెడగొట్డుకోకండి.

-ఒంటరి పోరే బిజేపికి బలం.

-ఇంతకాలం పార్టీని నమ్ముకున్న వారికి అవకాశం.

-పొత్తుతో మళ్ళీ అసంతృప్తి ఖాయం.

-కూటమి మూలంగా బలపడేది సైకిల్‌ మాత్రమే.

-అంతో ఇంతో జనసేనకు మేలే.

-ఎటొచ్చి బిజేపికే నష్టం.

-తొందరపాటు నిర్ణయాలు వద్దు.

-స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా బిజేపి మరింత బలపడాలి.

-పొత్తతో సీట్లు పంచుకుంటే కొత్త పంచాయతి మొదలౌతుంది.

-సైకిల్‌ ఎంతో కొంత ప్రభావం వుంటుంది.

-జనసేన దానికి తోడౌతుంది.

-బిజేపి ఉనికికి ప్రమాదమేర్పడుతుంది.

-ఇప్పటికే దేశంలో బిజేపి మసకబారుతోంది.

-ఒంటరి పోరే బిజేపికి ఆశాజనకంగా వుంటుంది.

హైదరబాద్‌,నేటిధాత్రి:

ఒకసారి, ఒకచోట కలిసొచ్చింది కదా! అని అదే ఫార్ములా ప్రతిసారి కలిసొస్తుందనుకోకూడదు. ఒక వేళ కలిసొస్తుందని నమ్మినా లాభం వుండదు. ఏపిలో కూటమి పనికొచ్చిందని, అదే దారిలో తెలంగాణలో నడుస్తామంటే కుదరదు. కూటమి తెలంగాణలో కూడా విజయం సాధిస్తుందని చెప్పడానికి సైన్సు కాదు. రాజకీయం. రాజకీయాల్లో ప్రతిదానికి ఒక లెక్క వుంటుంది. ఎప్పుడూ ఒకే లెక్క పనికిరాదు. ఒకే సమీకరణం ఎల్లకాలం ఉపయోగపడదు. కాలాన్ని బట్టి, పరిస్ధితులను బట్టి ఫలితాలు రావొచ్చు. కాలం కలసి రాకపోతే తిరగబడొచ్చు. ఏపిలో కలిసొచ్చిన కూటమి తెలంగానలో వికటించొచ్చు. తొందరపాటు నిర్ణయాలు, ప్రయోగాలు, పొత్తులు విఫలం కావొచ్చు. తెలం గాణలో బలపడాలంటే కూటమి బిజేపికి అడ్డంకిగా కూడా మారొచ్చు. బిజేపి తన బలాన్ని తక్కువగా అంచనా వేసుకొని కూటమితో జతకడితే మొదటికే మోసం రావొచ్చు. బిజేపి ఉనికికే ప్రమాదం రావచ్చు. దేశ వ్యాప్తంగా బిజేపి బలహీనపడుతున్నా, తెలంగాణలో బలపడుతోంది. ఇప్పుడు మంచి ఊపులో వుంది. పుంజుకునేందుకు అవకాశం వుంది. జోరు దశలో వుంది. ప్రజలు బిజేపి వైపు చూస్తున్నారన్నది పార్లమెంటు ఎన్నికలతో తేలిపోయింది. ప్రజల తీర్పు స్పష్టతనిచ్చింది. సరిగ్గా శాసన సభ ఎన్నికల ముందు బండి సంజయ్‌ను దింపేసి పెద్ద తప్పు చేసింది బిజేపి. ఆ ఎన్నికల్లో తనను తానే బిజేపి ఓడిరచుకున్నది. స్వయంకృతాపరాధం చేసుకున్నది. ఇప్పుడు కూటమి కట్టి మరో తప్పు చేయొద్దు. తప్పటడుగు వేయొద్దు. కోరి కోరి మరోసారి ఓటమిని కొని తెచ్చుకోవద్దు. తెలంగాణలో తెలుగుదేశంతో దోస్తీ బిజేపికి లాభం కన్నా, నష్టమే ఎక్కువ. రాజకీయాల్లో రెండు రెళ్లు ఎప్పుడూ నాలుగు కాదు. ఇక్కడ లెక్కలు వేరు. అంచనాలు ఎన్నికల్లో తారు మారు. గత చరిత్రలో జరిగింది ఇదే…తెలుగుదేశం పార్టీకి జరిగిన లాభం ఎక్కువే. ఇప్పుడు కూడా చంద్రబాబు అదే ఫార్ములాతో వస్తున్నారు. బిజేపికి ఆశలు కల్పిస్తున్నారు. ఆఖరుకు ఆటలో బిజేపిని ఆటలో అరటి పండు చేస్తారు. తెలుగుదేశం పార్టీ కన్నా, తెలంగాణలో బిజేపి పునాదులు బలంగా వున్నాయి. తెలంగాణలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజలు క్రియాశీలకపాత్రపోషించే స్ధాయిలోనే వున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌, రంగారెడ్డి, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం జిల్లాల రాజకీయాలను తారు మారు చేసే స్ధితిలోనే వున్నారు. అలాంటి సీమాంధ్ర ప్రజలు తెలుగుదేశంను కోరుకున్నంత బలంగా బిజేపిని కోరుకోరు. ఇది ముఖ్యంగా బిజేపి నాయకులు తెలుసుకోవాలి.

బిజేపి అడ్డుపెట్టుకొని ఏపి. సిఎం. చంద్రబాబు తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఏలేందుకు కృషి చేస్తాడే తప్ప, బిజేపికి అధికారం అప్పగించాలనుకోరు.

ఎందుకంటే గతంలో అనేక సంఘటనలున్నాయి. తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు ఎప్పుడూ తన రాజకీయం కోసం ఎటు నుంచి ఎటైనా వెళ్తారు. ఎన్ని సార్తైనా యూ టర్న్‌లు తీసుకుంటారు. గత ఎన్నికల్లో చంద్రబాబు బిజేపితో జతకట్టడంతో వున్న ఆంతర్యం తెలంగాణ బిజేపి నేతలకు తెలియంది కాదు. అయినా తెదేపాతో భవిష్యత్తులో జత కట్టాలనుకుంటే నిండా మునగడం ఖాయం. తెలంగాణలో బిజేపికన్నా, తెలుగుదేశమే బలంగా వుంటుంది. ఇది ఎవరు నమ్మినా, నమ్మకపోయినా నిజం. కాకపోతే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నిద్రాన స్దితిలో వుంది. అంతే..తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులేదు. బిజేపితో జతకడితే తెలుగుదేశం పార్టీకి మేలు జరుగుతుంది. అంతే కాని బిజేపికి ఒక్కశాతం కూడా అదనంగా ఉపయోపడే అవకాశంలేదు. ఇక దేశ రాజకీయాల్లో వచ్చే ఎన్నికల నాటికి పరిస్ధితులు ఎలా వుంటాయన్నది ఎవరూ అంచనా వేయలేకపోవచ్చు. ఈ పార్లమెంటు ఎన్నికల్లోనే బిజేపి పూర్తి మెజార్టీ సాధించలేదు. ఎన్డీయే పక్షాల మీద ఆధారపడి రాజకీయం చేయాల్సి వస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అందువల్ల బిజేపి జాతీయ నాయకత్వం ఇప్పుడు తెదేపా గీసిన గీత దాటకుండా పనిచేస్తుందే గాని, చంద్రబాబు దూరం చేసుకునే అవకాశం లేదు. ముఖ్యంగా 2014 ఎన్నికల్లో ఇదేకూటమి ఏపిలో కలిసి పోటీచేసింది. గెలిచింది. అప్పుడు కేంద్రంలో బిజేపి పూర్తి మెజార్టీ సాధించింది. పొత్తు ధర్మం వదిలేసింది. దాంతో ఏపికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదాకు కొర్రీలు పెట్టింది. అమరావతికి ఇవ్వాల్సిన నిధులకు గండి కొట్టింది. పోలవరానికి పూర్తి మద్దతు ఆపేసింది. దాంతో చంద్రబాబు యూ టర్న్‌ తీసుకున్నారు. బిజేపికి జెల్ల కొట్టారు. జాతీయ స్దాయిలో బిజేపి మరింత బలపడిరది. ఏపిలో చంద్రబాబు పార్టీ ఓడిపోయింది. ఆ ఎన్నికల్లో చంద్రబాబు ఎన్ని విన్యాసాలు వేసినా, ప్రజలు పట్టించుకోలేదు. ఆయనను గెలిపించలేదు.

2024 ఎన్నికల్లో మళ్లీ చంద్రబాబు గెలుస్తానన్న ఆశ పెద్దగా లేదు. దాంతో బిజేపి పంచన చేరాడు.

బిజేపి పెద్దల ఆశీస్సుల కోసం పడిగాపులు కాశాడు. పవన్‌ రాయబారిని చేసుకున్నాడు. ఎట్టకేలకు బిజేపిని ప్రసన్నం చేసుకున్నాడు. జాతీయ స్ధాయిలో బిజేపి ముఖ్యంగా ఉత్తరాదిన కొంత ఇబ్బందికనిపించి, తెలుగుదేశంతో జరకట్టారు. ఎప్పుడైనా మోడీ అంచనాలే నిజమయ్యాయి. కాని బాబు అంచనాలు ఏనాడు నిజం కాలేదు. ఇది ముఖ్యంగా బిజేపితెలంంగాణ నాయకులు తెలుసుకోవాలి. ఇప్పటికైనా జాతీయ స్దాయి నాయకత్వ సూచనలు ఆదారం చేసుకొని నడిస్తే బాగుంటుంది. గత శాసన సభ ఎన్నికల ముందు తెలంగాణలో బిజేపి బలంగా తయారైంది. కాని ఉన్న ఫలంగా జాతీయ స్ధాయి నాయకుల మీద ఒత్తిడి తెచ్చి బండి సంజయ్‌ను తప్పించారు. తమ కళ్లను తామే పొడుచుకున్నారు. ఎన్నికల సమయంలో తెలంగాణలో బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్‌ వుంటే, ఫలితాలు మరో రకంగా వుండేవన్నది ఎవరూ కాదనలేని సత్యం. అయినా ఆయనిచ్చిన ఊపుతో అసెంబ్లీ కూడా 8 సీట్లు సాధించింది. పార్లమెంటులో కూడా నాలుగు సీట్లు పెంచుకొని, 8కి పెరిగింది. గడచిన నలభై ఏళ్లలో తెలుగుదేశంతో జరకట్టినా ఏనాడు బిజేపికి ఇన్ని సీట్లు దక్కలేదు. ఏపిలో జరిగిన ఎన్నికల్లో గెలుస్తామో…ఓడుతామో అన్న సందిగ్ఘంలో వున్నా, చంద్రబాబు బిజేపికి కోరినన్ని సీట్లు ఇవ్వలేదు. ఇక్కడ తెలంగాణ బిజేపి నేతలు ఈ విషయాన్ని గమనించాలి. రేపటి రోజు తెలంగాణలో కూడా చంద్రబాబు అడిగినన్ని సీట్లు ఇచ్చే అవకాశం వుండదు. ఈ నెలలోనే మరోసారి ఎన్టీఆర్‌ భవన్‌లో చంద్రబాబు తెలంగాణ శ్రేణులతో కలిసి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. కమిటీలు కూడా ప్రకటించేందుకు సిద్దమౌతున్నారు. త్వరలో స్ధానిక సంస్ధల ఎన్నికలు జరగాల్సి వుంది. వాటికి ఏడాది సమయం కూడా పట్టొచ్చు. ఈ గ్యాప్‌లో తెలుగుదేశం పార్టీ ఊరూర జెండా కార్యక్రమం చేపట్టే అవకాశం వుంది. ఎంతో కొంత బలపడేందుకు అవకాశం దక్కించుకుంటుంది. ఆ ఎన్నికల్లో బిజేపి, జనసేన పొత్తుతో వెళ్లేందుకు సిద్దపడతారు. ఎన్ని పంచాయితీలు గెలిచామన్నది లెక్కలేసుకుంటారు. ఎన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నామన్నదానితో ముందు అడుగులు వేస్తారు. ఎన్ని జడ్పీటీసిలు గెలిచి, జడ్పీలపై జెండా ఎరిగిందన్నదానిపై దృష్టిపెడతారు. దాంతో బిజేపి లెక్కలు తలకిందులు చేస్తారు. తెలంగాణలో బలపడతారు. బిజేపికి సీట్లు ఇచ్చే విషయంలో పేచీ పెడతారు. ఇది బిజేపి ముందు తెలుసుకోవాల్సిన అంశం. అందువల్ల తెలుగుదేశంతో పొత్తు విషయం వస్తే మాత్రం ఆ పార్టీకే సీట్లు ఇచ్చే స్దితికి బిజేపికి చేరాలి. తెలుగుదేశం విధానాలు ఇంకా ఇప్పటి బిజేపి నేతలకు పెద్దగా తెలియదు. గతంలో 2009 ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ పార్టీ తెలుగుదేశం పొత్తుతో ఎన్నికలకు వెళ్లాయి. అప్పుడు తెరాస పూర్తి స్ధాయిలో తెలుగుదేశం పార్టీకి సహకరించింది. కాని తెలుగుదేశంపార్టీ బిఆర్‌ఎస్‌కు అనుకున్నంతగా సహకరించలేదు. ఇది చంద్రబాబు రాజకీయ వ్యూహంలో ఒక భాగం. భవిష్యత్తులో ఇదే విధానాన్ని బిజేపి విషయంలో అమలు చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!