
పలుచోట్ల నమోదవుతున్న కేసులు
వానకాలం సీజన్ కావడంతో గ్రామాలల్లో ప్రజల జాగ్రత్తగా ఉండాలి
పగడిపూట కుట్టే దోమలతో తస్మాత్ జాగ్రత్త
వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత ప్రజలకు ప్రధానం
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి..
ఏజెన్సీ ప్రాంతాలలో విష జ్వరాల పంజా మారు మోగిస్తున్నాయి మొన్నటి వరకు ఎండల తీవ్రతకు అల్లాడిపోయిన ప్రజలు ఒక్కసారి వాతావరణం మార్పు కు కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాలలో విష జ్వరాల కేసులు నమోదవుతున్నాయి వర్షాకాలం సీజన్ ప్రారంభం కావడంతో రోగాల బారిన పడి ప్రజలు ఆస్పత్రులకు క్యూ లైన్లు కడుతున్నారు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చల్లబడిన వాతావరణం కారణంగా రోగకారకాలు ప్రజలకు పెనుముప్పుగా తయారవడంతో మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, వైరల్ ఫీవర్ వ్యాధులతో జనం ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు వర్షాకాలం సీజన్ కావడంతో ప్రజలు కనీస జాగ్రత్తలు తీసుకోకపోతే ఎక్కువ మొత్తంలో రోగాల బారిన పడే అవకాశం ఉంది
పగటిపూట కుట్టే దోమలతో చాలా ప్రమాదం
పగటిపూట కుట్టే దోమల్లో ఈ డేస్ ఈజీ అనే ఆడదోమా ప్రమాద బారిన పడే అవకాశం ఉందని తెలుస్తుంది దీని లార్వ ద్వారా చికెన్ గున్య వ్యాధి సోకి జ్వరం కీళ్ల నొప్పులు ఒళ్ళు నొప్పులు ప్రజలు మంచాన బారిన పడే అవకాశం ఉంటుంది
వ్యాధులు సోకకుండా తగు నియమాలు పాటించాలి
ఏజెన్సీలో ప్రతి మారుమూల గ్రామాలలో వ్యాధులు సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా ఇంటి పరిసరాలను పరిశుభ్రతగా ఉంచుకోవడంతో పాటు సైడ్ వీధులలో మురికి నీరు నిలవకుండా శుభ్రం చేసుకోవాలి రోడ్లపై అమ్ముతున్న తిను బండారాలను పిల్లలకు దూరంగా ఉంచి ఇంట్లో వండిన వేడి ఆహార పదార్థాలను తీసుకోవాలి త్రాగే నీరుని బాగా మరిగించి వడగట్టి చల్లార్చిన నీటిని త్రాగాలి వీలైనంత తాజా కూరగాయలను వాడటం వలన రోగాల బారిన పడకుండా అవకాశం ఉంటుంది